
మొక్కల వేళ్లు.. దాని పరిసర ప్రాంతాల్లో ఉండే వైవిధ్యభరితమైన బ్యాక్టీరియా సాయంతో అనేక కొత్త యాంటీబయాటిక్, కేన్సర్ మందులు తయారు చేయవచ్చునని అమెరికాలోని ఓక్రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనిషి పేవుల్లోని బ్యాక్టీరియా కంటే కనీసం పది రెట్లు ఎక్కువ వైవిధ్యతతో కూడిన బ్యాక్టీరియా మొక్కల వేళ్ల వద్ద ఉంటుందని.. ఇవి ఇప్పటివరకూ పరీక్షించని అనేక వినూత్నమైన రసాయన మూలకాలను ఉత్పత్తి చేస్తాయని వీరు తెలిపారు.
చుట్టూ ఉండే సహజసిద్ధమైన పదార్థాలను వాడుకుంటూ బ్యాక్టీరియా ఇతర బ్యాక్టీరియా, మొక్కలతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయని మనకు తెలుసు. ఈ క్రమంలో విడుదలయ్యే రసాయనాలు బ్యాక్టీరియా ఎదుగుదలకు, శత్రు బ్యాక్టీరియా నుంచి రక్షణకు అవసరమైన రసాయనాలూ విడుదలవుతాయని.. వీటిని యాంటీబయాటిక్‌లుగా వాడుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిచ్ డోకిచ్ తెలిపారు. ఈ నేపథ్యంలో అరుదైనవి కాకుండా.. అందరికీ తెలిసిన మొక్కల వేళ్ల వద్ద తాము పరిశీలనలు జరిపామని, సహజసిద్ధమైన రసాయనాలను విశ్లేషించడం ద్వారా కొత్త కొత్త యాంటీబయాటిక్‌లు లభిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment