కడుపులో పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆరోగ్యంగా, తగినంత బరువు మాత్రమే ఉండే వారిలో మంచి బ్యాక్టీరియా చేరేందుకు కావాల్సిన కీలకమైన ప్రొటీన్ ఉత్పత్తిని చక్కెర అడ్డుకుంటుందని అంటున్నారు యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. చక్కెర పేగుల్లోనే జీర్ణమైపోతుందని కడుపులోకి రాదని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ కట్టిన అంచనా తప్పని ఈ కొత్త పరిశోధన చెబుతోంది. ఫ్రక్టోజ్ గ్లూకోజ్ వంటి చక్కెరలు ఎక్కువగా ఉండే పాశ్చాత్యదేశాల ఆహారం బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు తాము ఈ పరిశోధన చేపట్టామని ఈ రెండు కలిసి తయారు చేసే సుక్రోజ్ ఆర్‌ఓసీ అనే ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపిస్తున్నాయని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎడ్యురాడో గ్రోయిస్‌మాన్ తెలిపారు. ఫలితంగా కొన్ని రకాల బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో మనుగుడ సాగించలేకపోతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment