పెట్రోల్లాంటి ఇంధనాన్ని బ్యాక్టీరియాతో ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ అంటున్నారా? అమెరికా శాస్త్రవేత్తల పుణ్యమా అని త్వరలోనే ఈ అద్భుతం వాస్తవం కానుంది. సరస్సులు, మురికినీటిలోన ఉండే రెండు వేర్వేరు బ్యాక్టీరియా సమూహాల్లోని ఎంజైమ్‌ను ఉపయోగిస్తే బ్యాక్టీరియా స్వయంగా టౌలీన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త హారీ బెల్లర్ అంటున్నారు. పెట్రోలు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు టౌలీన్‌ను ఉపయోగిస్తూంటారు.
ఏటా ఈ రసాయనం దాదాపు మూడు కోట్ల టన్నులు విక్రయమవుతూంటుంది. నిజానికి కొన్ని బ్యాక్టీరియా తక్కువస్థాయిలో టౌలీన్‌ను ఉత్పత్తి చేయగలవని 1980లలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. కాకపోతే ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు మాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో హారీ ఈ రకమైన బ్యాక్టీరియాపై పరిశోధనలు మొదలుపెట్టారు. చివరకు సరస్సుల అడుగుభాగాల్లో, మురికినీటిలో ఉండే రెండు బ్యాక్టీరియా ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ సాయంతో పెద్దఎత్తున టౌలీన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా టౌలీన్ ఉత్పత్తి పద్ధతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని.. ఆ తరువాత బ్యాక్టీరియాతోనే ఈ రసాయనాన్ని ఉత్పత్తి చేయడం వీలవుతుందని హారీ వివరించారు.
బ్యాక్టీరియాతో పెట్రోల్లాంటి ఇంధనం ఉత్పత్తి!
Published Wed, Mar 28 2018 12:42 AM | Last Updated on Wed, Mar 28 2018 12:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment