
మలేరియా వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు. ఈ వ్యాధికి కారణమైన ప్లాస్మోడియం ఫాల్సీపరమ్ అనే బ్యాక్టీరియా శరీర కణంలోకి ప్రవేశించేందుకు, బయటపడేం దుకు ఉపయోగపడే కీలకమైన రెండు ఎంజైమ్‌లను జెనీవా, బెన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎంజైమ్‌లలో ఒకటి కణత్వచాన్ని చీల్చి లోపలికి ప్రవేశించేందుకు ఉపయోగపడగా.. రెండోది బ్యాక్టీరియా తన దాడిని మొదలుపెట్టేందుకు ఉపకరిస్తుంది.
మన రక్తం, కాలేయంతోపాటు దోమ కడుపులో కూడా ఈ బ్యాక్టీరియా ఈ రెండు ఎంజైమ్‌లపైనే ఆధారపడుతున్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిని నిర్వీర్యం చేసేందుకు మార్గం సుగమం చేశారు. వాటిని నిర్వీర్యం చేసే మందులు తయారైతే అటు మలేరియా వ్యాధిగ్రస్తుల్లోని బ్యాక్టీరియా నాశనం అవడమే కాకుండా.. అది దోమల్లోకి చేరి వ్యాధిని మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment