Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి | JNU scientists develop new vaccine candidate to battle malaria | Sakshi
Sakshi News home page

Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి

Published Thu, May 23 2024 11:57 AM | Last Updated on Thu, May 23 2024 1:07 PM

JNU scientists develop new vaccine candidate to battle malaria

మలేరియావ్యాధి నిర్మూలనలో  పరిశోధకులు  గొప్ప పురోగతి సాధించారు.  జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్‌ తయారీలో మరో అడుగు ముందు కేశారు. 

జెఎన్‌యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్‌ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన,  టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించింది.

మనిషిలోఇన్ఫెక్షన్‌కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్‌బీ2-హెచ్‌ఎస్‌పీ70ఏ1ఏను గుర్తించినట్లు   పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్‌ శైలజ  తెలిపారు. ఈ పారాసైట్‌ ప్రొటీన్‌ పీహెచ్‌బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేయగలదన్నారు.

మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము  గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. 

వివిధ సెల్యూలార్‌ ప్రాసెస్‌లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్‌ ఇవి అని చెప్పారు. పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని  ఇరువురు ప్రొఫెసర్లు  పునరుద్ఘాటించారు.

మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి.  ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను  బలితీసుకొంటోంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ  2022 నివేదిక ప్రకారం  ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. 

యాంటీ మలేరియల్‌ డ్రగ్స్‌ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement