develop
-
Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి
మలేరియావ్యాధి నిర్మూలనలో పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు ముందు కేశారు. జెఎన్‌యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన, టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించింది.మనిషిలోఇన్ఫెక్షన్కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేయగలదన్నారు.మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ ఇవి అని చెప్పారు. పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని ఇరువురు ప్రొఫెసర్లు పునరుద్ఘాటించారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి. ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు. -
వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా ‘తిరుపతి’.. డిజైన్లు విడుదల రైల్వే శాఖ మంత్రి
సాక్షి, తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. కాంట్రాక్టులన్ని పూర్తి చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఆయన డిజైన్లు కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. కచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే.. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వే ద్వారానే వస్తుంటారు. వేలాది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రావడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. -
వారికి ఆర్థిక స్థిరత్వం అక్కర్లేదా?
ప్రస్తుతం దేశ ఆర్థిక సుస్థిరతకు, నిరుద్యోగ నివారణకు, వ్యవసాయ ప్రాముఖ్యం కలిగిన జాతీయ ప్రణాళికలు రూపొందించవలసిన అవసరం ఉంది. 65 శాతం ప్రజలకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయి పోటీకి నిలబడే స్థాయిలో వనరులు, వసతులు కల్పించాలి. రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు కలసి రైతుల ఆర్థిక సుస్థిరతకు, సామాజిక గుర్తింపు పొందేందుకు అవసరమైన కొత్త విధానాలు అమలు పరచాలి. రాజ్యాంగం ఆర్టికల్ 14–18 ద్వారా పౌరులకు సమానత్వ హక్కు కల్పించినది. కానీ డెబ్బై ఐదేళ్ల తరువాత కూడా అసంఘ టిత రైతులకు.. సంఘటిత వర్గాలైన ఉద్యోగులు, వ్యాపారులతో సమానంగా ఆర్థిక సమానత్వం కలగనేలేదు. ఆర్టికల్ 19–22 పేర్కొన్నట్లుగా స్వేచ్ఛా వ్యాపారానికి గాని, సాంకేతిక నైపు ణ్యాన్ని గానీ పొందేందుకు స్వతంత్రం లేదు. ఆర్టికల్ 23–24 నిర్దేశించినట్లుగా దళారుల దోపిడీని అరికట్టే శక్తి స్థోమతలు లేవు. ఆర్టికల్ 29–30 ప్రకారం నాణ్యమైన విద్యా హక్కు లేదు, ఆరోగ్య వసతులు లేవు. రైతులు నేడు 23 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 31 కోట్ల టన్నుల కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడి ఆహార కొరత లేకుండా చేశారు. కానీ దేశంలో ఏ ఒక్క రైతుకు కూడా ఆర్థిక స్థిరత్వం లేదు. గత ముప్పై ఏళ్లుగా పారిశ్రామిక సేవా రంగాలు 10 శాతం అభివృద్ధి సాధించాయి కానీ, వ్యవసాయ రంగం 2 శాతం దగ్గరే స్తంభించిపోయింది. నిరుద్యోగం, వలసలు, ఆత్మ హత్యల పరిస్థితిలో మార్పులు లేవు. వ్యవసాయంలోకి యువ కులు అసలే రావటం లేదు. నిత్యం కరువుకాటకాలతో బాధపడుతున్న తెలంగాణ రైతులకు కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి సౌకర్యం కలుగజేసింది. వరి ఉత్పత్తి 40 లక్షల టన్నుల నుండి 110 లక్షల టన్నులు పండించేందుకు అవకాశం కల్పించింది. ఇంతచేస్తున్నా పండించిన వరి పంటకు కేంద్రం కనీస మద్దతు ధర ఇవ్వక, కొనుగోలు చేసే వసతి లేక తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటల అమ్మకానికీ, ఎగుమ తులకు వసతి కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధి లోనే ఉన్నప్పటికీ ఆ మేరకు చర్యలు చేపట్టలేదు. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగంలో పేర్కొన్నారు. పంటల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి ఆంక్షలు విధించే అధికారం ఉంది. అందుకే ఎగుమతి, దిగుమతులపై ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పంటల ధరల్ని నియంత్రించే కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయానికి అవసరమైన పురుగు మందులు, డీజిల్, యంత్రాలపై ధరలను అదుపు చేయడం లేదు. రుణాలు అందించడంలో, బీమా పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయి. పండించి పతనమవుతున్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల వారి రైతుల సమస్యలకు ముఖ్య కారణమిదే. 1960లో నెహ్రూ ఆహార కొరత తీర్చడానికి భారీ నీటిపారుదల ప్రాజె క్టులు చేపట్టినా.. ఇందిరా గాంధీ అధి కారంలోకి వచ్చిన తరువాత హైబ్రిడ్ గోదుమ విత్తనాలను మినహాయించి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే రైతుల దుఃస్థితికి ఈనాటికీ ఒక ముఖ్య కారణం. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2004–2012 మధ్య వ్యవసాయ అభివృద్ధికి అత్యంత ఉపయో గకరమైన డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ రిపోర్టును అమలు చేయటంలో విఫలమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఇష్టారాజ్యంగా అధికారం చేసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించి నిలిచింది ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే! ఆయన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నాయకత్వాన్ని ధిక్కరించి మరీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవ డానికి ఏకైక కారణం నరేంద్రమోదీ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చేసిన వాగ్దానాలే! అయితే గత ఏడు సంవత్సరాలలో బీజేపీ వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను, నాణ్యతను మెరుగు పరచడానికి, ఖర్చులు తగ్గించడానికి, అంతర్జాతీయ స్థాయికి వ్యవసాయ రంగం ఎదిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేదు. 2020లో ప్రకటించిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలలో స్పష్టత లేనందున, కొన్ని వర్గాల రైతులలో వ్యతిరేకత వల్ల ఆ సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక సుస్థిరతకు, నిరుద్యోగ నివారణకు, వ్యవసాయ ప్రాముఖ్యం కలిగిన జాతీయ ప్రణాళికలు రూపొం దించవలసిన అవసరం ఉంది. 65 శాతం ప్రజలకు ఆధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయి పోటీకి నిలబడే స్థాయిలో వనరులు, వసతులు కల్పించాలి. రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు కలసి రైతుల ఆర్థిక సుస్థిరతకు, సామాజిక గుర్తింపు పొందేందుకు అవసరమైన కొత్త విధానాలు అమలు పరచాలి. రాజ్యాంగం కూడా రైతు హక్కులను కాపాడటంలో విఫలమైందని స్పష్టంగా నిరూపితమైంది. దేశంలో కుల వ్యవస్థ స్థానంలో, వర్గవ్యవస్థ ఏర్పడింది. నేడు దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, పంటలకు లాభసాటి ధరలు నిర్ణయించి, రైతు లకు ఆర్థిక సమానత కల్పించి, సామాజిక గౌరవం కలిగించా లంటే ఇప్పుడున్న లోపాలను పరిశీలించి, చర్చించాలి. అవసర మైన రాజ్యాంగ మార్పులు తేవాలి. పెద్దిరెడ్డి చంగల్‌రెడ్డి వ్యాసకర్త న్యాయవాది, అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ముఖ్య సలహాదారు -
ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు.. టీడీపీ ద్రోహం
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు గత తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నాయో వివరిస్తూ ఐదేళ్ల కాలంలో రూ.24,350 కోట్లు ఇవ్వాలని అధికారులు సవివరమైన నివేదికను కేంద్రానికి సమర్పించారు. కానీ, నాటి ముఖ్యమంత్రి ఈ నిధుల సాధనలో పూర్తిగా చతికిలపడ్డారు. స్వయాన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రే ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో ఈ విషయం తేటతెల్లమైంది. అధికారులు రూపొందించిన లెక్కల ప్రకారం నిధులు సాధించాల్సిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. జిల్లాకు ఏడాదికి కేవలం రూ.50 కోట్లు ఇస్తామంటే ఆయన ఓకే చెప్పారు. అంటే ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు కేంద్రం ఇస్తానంటే చంద్రబాబు అందుకు సరేనన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మూడేళ్లపాటు రూ.350 కోట్ల చొప్పున విడుదల చేయగా ఆ నిధులనూ టీడీపీ సర్కారు సక్రమంగా వినియోగించలేదు. వాటి వినియోగ పత్రాలు సమర్పిస్తేనే తదుపరి నిధులు ఇస్తామని స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం.. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి వాటి విడుదలను నిలుపుదల చేసింది. అలాగే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కూడా పైసా ఇవ్వలేదు. ఒక రకంగా వేల కోట్ల రూపాయలు ఆ జిల్లాలకు రాకుండా చేయడమే కాక, కేంద్రం ఇస్తానన్న అరకొర నిధులు కూడా రాకుండా చంద్రబాబు ఆ ప్రాంతాలకు తీరని ద్రోహం చేశారు. ఈ జిల్లాల్లో అక్షరాస్యత పెంచడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులను వినియోగించాల్సి ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యహరించింది. టీడీపీకి భిన్నంగా వైఎస్సార్సీపీ.. అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 2019–20లోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.350 కోట్లను కేంద్రం నుంచి సాధించింది. అలాగే.. 2020–21 ఆర్థిక ఏడాదిలో కూడా మరో రూ.350 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించింది. అంతేకాక.. సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సమయంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కోరిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదిరి వెనుకబడిన జిల్లాల నిధుల విడుదల వివరాలను వెల్లడించారు. -
ప్రపంచంలోకెల్లా అతిచిన్న మైక్రోస్కోప్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచంలోనే అతిచిన్న మైక్రోస్కోప్‌ను హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ముస్కోప్గా నామకరణం చేసిన ఈ ఆవిష్కరణ ఆటోమెటిక్‌గా పనిచేస్తుందని, దీన్ని ఎక్కడికైనా సులువుగా తరలించవచ్చని ఐఐటీ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. దీని తయారీకి తక్కువ ఖర్చు అయిందని పేర్కొన్నాయి. వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్ ఎంతో ఉప యోగపడుతుందని పేర్కొన్నాయి. ఆఫ్–ది షెల్ఫ్ ఎలక్ట్రానిక్ చిప్‌లతో తయారు చేసిన ఈ పరికరం వ్యాధులను గుర్తించే పనిని విస్తృతం చేస్తుందని తెలిపాయి. దీన్ని డాక్టర్ శిశిర్‌కుమార్ ఆవిష్కరించారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఆయనను అభినందించారు. సాంకేతికత ప్రయోజనాలను సమాజానికి అందిం చేందుకు హైదరాబాద్ ఐఐటీ కృతనిశ్చయంతో పని చేస్తోందని చెప్పారు. డాక్టర్ శిశిర్ కుమార్ నేతృత్వంలో పరిశోధకులు ఏక్తా ప్రజతి, ఎంటెక్ విద్యార్థి సౌరవ్ కుమార్ ఈ మైక్రోస్కోప్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు. -
బెంగ తీరిన అంగన్వాడీ
వీరఘట్టం: విరిగిన గచ్చులు, బీటలు వారిన గోడలు, వెలిసిపోయిన రంగులతో అధ్వానంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఇక మీదట మహర్దశ పట్టనుంది. వీటిని నాడు–నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక మీదట చక్కటి వాతావరణం, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట స్థలం, గర్భిణులు, బాలింతలకు వైద్య తనిఖీలు చేసేందుకు ప్రత్యేక గదులు ఉండేలా అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో కనీస మౌలిక వసతులు లేని 977 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించారు. వీటిని అభివృద్ధి పరచేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండే స్ధలంలో ఇక నుంచి సుందరంగా ముస్తాబైన అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వెనుకబడిన కేంద్రాలకు మహర్దశ.. జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 4,192 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,199 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 1,743 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, 1,250 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోను, సామాజిక భవనాల్లోను నడుపుతున్నారు. ఈ కేంద్రాల్లో 36,083 మంది గర్భిణులు, బాలింతలు, 1.10 లక్షలమంది 0–6 వయస్సుగల చిన్నారులకు సేవలు అందుతున్నాయి. ఈ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు లేనటువంటి 977 కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. వీటికి సంబంధించిన ఫైలుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. ఒక్కో కేంద్రాన్ని రూ.7.50 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5 లక్షలు, ప్రభుత్వ నిధులు రూ.2.50 లక్షలు వెచ్చించనున్నారు. మొత్తం రూ.73.27 కోట్లను ఇందుకోసం కేటాయించారు. ప్రత్యేకంగా గదులు గతంలో వలే కాకుండా పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకలి్పంచింది. అందరికీ అందుబాటులో ఉండే స్ధలంలోనే వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధానంగా ప్రీ స్కూల్‌ను దృష్టిలో ఉంచుకొని వరండా, ఆటస్ధలం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున కేంద్రాలు అందుబాటులోకి రానుండడంతో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు, గర్భిణులకు ఆ అవస్ధలు తప్పనున్నాయి. ఈ కేంద్రాల్లో నాలుగు గదులను నిర్మిస్తారు. హాల్, న్యూట్రిషన్ రూమ్, కిచెన్ రూమ్, ఒక స్టోర్ రూమ్‌లుగా వీటిని వినియోగిస్తారు. అన్ని మౌలిక వసతులతో నిర్మాణాలు జిల్లాలో కనీస మౌలిక వసతులు లేని 977 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించాం. వీటిని అభివృద్ధి చేసి చిన్నారులు, బాలింతలకు ఉపయుక్తంగా తయారుచేస్తాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనులు జరగనున్నాయి. ప్రతి కేంద్రం అభివృద్ధికి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. త్వరలోనే పనులు చేపడతాం. –జి.జయదేవి, ఐసీడీఎస్, పీడీ, శ్రీకాకుళం -
ఇష్టం మీది...పుస్తకం మాది!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టడమే కాకుండా సామాజిక అంశాలు, చరిత్ర, కరెంట్ అఫైర్స్ తదితరాలు తెలుసుకునే వీలుగా ప్రతి గురుకులంలో గ్రంథాలయ అభివృద్ధికి ఉపక్రమించింది. విద్యార్థులు ఇష్టపడే పుస్తకాలను తెప్పించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ట్రస్ట్‌తో అవగాహన కుదుర్చుకుంది. సొసైటీ పరిధిలో 251 గురుకుల పాఠశాలలు, 29 జూనియర్ కళాశాలలతో పాటు మరో డిగ్రీ కాలేజీ ఉంది. వీటి పరిధిలో 1.15లక్షల మంది విద్యార్థులున్నారు. ఏ పుస్తకం అడిగినా ఓకే... గురుకుల విద్యాలయాల లైబ్రరీల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలతో పాటు అదనంగా తెప్పించేందుకు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్స్‌పాళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. వీటిలో నచ్చిన పుస్తకాల జాబితాలను ఆయా ప్రిన్స్‌పాళ్లకు అందించారు. విద్యార్థుల ఆసక్తి, అభిరుచికి తగిన పుస్తకాల జాబితాలను వారే సొసైటీకి అందించాలి. అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. సంస్కృతి, చరిత్ర, ప్రస్తుత అంశాలతో పాటు పోటీ పరీక్షలు, సివిల్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచుతున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. అవసరాలకు తగ్గ కొనుగోలు ప్రతి గురుకుల విద్యా సంస్థలో ఒక గ్రంథాలయం ఉంది. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉండగా.. విద్యార్థుల ఆసక్తికి తగిన పుస్తకాలు కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. విద్యార్థులు ఏయే పుస్తకాలు కోరారో.. వాటిని హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీకి జాబితా ఇస్తాం. గరిష్టంగా 50% రాయితీపై వారు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పుస్తకాల కొనుగోలుకు గురుకుల విద్యా సంస్థకు రాష్ట్ర కార్యాలయం నుంచే అనుమతులిస్తున్నాం.– మల్లయ్య భట్టు,కార్యదర్శి, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ -
హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ మంత్రి కె.తారకరామారావు కోరారు. హైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలు తీర్చగలిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీ)లో భాగంగా చేపడుతున్న పలు రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేటీఆర్ మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఎస్ఆర్డీ వివరాలు.. ఈ సందర్భంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ గురించి అమిత్ షాకు కేటీఆర్ వివరించారు. ఎస్ఆర్డీలో భాగంగా స్కైవేలు, ప్రధాన కారిడార్లు (166 కి.మీ), ప్రధాన రోడ్డు (348 కి.మీ), ఇతర రహదారులు (1,400 కి.మీ)ల అభివృద్ధికి సంకల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ఫేజ్–1లో రసూల్‌పుర జంక్షన్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇంటర్ స్టేట్ వైర్లెస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 1.62 ఎకరాల భూమి అవసరమవుతుందని వివరించారు. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు భూమిని బదలాయించాలని కోరారు. ఈ భూమిని జీహెచ్ఎంసీకి బదలాయించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్ర హోం శాఖ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే 2017లో కేంద్ర హోం శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం ఎస్ఎన్ స్వామి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు సంయుక్తంగా జరిపిన సర్వేలో ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల స్టేషన్లో కమ్యూనికేషన్ ఇన్స్టాలేషన్ ఎలాంటి ప్రభావానికి లోనుకాదని, కేవలం స్టాఫ్ క్వార్టర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకు, సంపు, స్టోర్‌రూం మాత్రమే ప్రభావితమవుతాయని నివేదిక సమర్పించిందని వివరించారు. అయితే కేంద్ర హోం శాఖ నుంచి భూమి బదలాయింపుపై ఇప్పటివరకు ఆదేశాలు జారీ కాలేదని చెప్పారు. ఫార్మాసిటీకి సాయం కావాలి.. ఫార్మా రంగంలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా రూపొందించిన హైదరాబాద్ ఫార్మా సిటీ (హెచ్పీసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సహా బడ్జెటరీ సాయం చేయాల్సిందిగా కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ప్రతిపాదిత హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్‌ను సమీకృతం చేసుకుంటూ 19,333 ఎకరాల్లో ప్రణాళికలు రచించిన హైదరాబాద్ ఫార్మా సిటీ ఆవశ్యకతను గోయల్‌కు వివరించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో గోయల్‌ను ఆయన కార్యాలయంలో కలసిన కేటీఆర్..హెచ్‌పీసీపై వివరాలందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ డీపీఐఐటీ ఈ ప్రాజెక్టును సూత్రప్రాయంగా అంగీకరించడమే కాకుండా, ‘నిమ్జ్’(నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్)గా గుర్తించిందన్నారు. ఈ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా 8,400 ఎకరాల్లో పనులకు డీపీఆర్, డిజైన్లు సిద్ధమయ్యాయని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు కూడా పొందామని వివరించారు. తొలి విడత పనుల్లో బాహ్య మౌలిక వసతుల్లో భాగంగా రోడ్లు, నీటి వసతికి రూ.1,318 కోట్లు, అంతర్గత మౌలిక వసతుల్లో భాగంగా 50 శాతం వ్యయం (రూ.2,100 కోట్లు) భరించాలని కోరారు. డిజైన్ సెంటర్‌కు అనుమతులివ్వండి.. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం, ప్రచార శాఖతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. ఈ ప్రతిపాదిత నేషనల్ డిజైన్ సెంటర్.. కన్సల్టెన్సీ సర్వీసులు, దేశంలో డిజైన్ రంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకు, భారత డిజైన్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు, మార్కెటింగ్, ఎక్స్పో, ఎగ్జిబిషన్, డిజైన్ వర్క్‌షాప్‌లకు ఉపయోగపడుతుం దని వివరించారు. డిజైన్ సెంటర్లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రపంచ స్థాయి నిపుణులు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. డిజైన్ సెంటర్ బిల్డింగ్‌ను రూపొందించడంలో, మెంటార్‌గా వ్యవహరించేందుకు ఆపిల్ స్టోర్ రూపకర్త టిమ్ కొబె సహా ఆటోమోటివ్ వింగ్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా మోటార్స్ డిజైన్ విభాగం హెడ్ ప్రతాప్ బోస్ ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అకాడమీ ప్రోగ్రాంల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఫిన్లాండ్లోని ఆల్టో యూనివర్సిటీ ఆసక్తిగా ఉందన్నారు. రైల్వే సైడింగ్ వసతి కల్పించండి.. ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు జిల్లాలోని పండిళ్లపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే సైడింగ్ వసతి ఏర్పాటు చేయాల్సిందిగా గోయల్‌ను కేటీఆర్ కోరారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న గ్రానైట్ పరిశ్రమల నుంచి ప్రస్తుతం లారీల్లో ఎగుమతులు జరుగుతున్నాయని, వీటి వల్ల నిర్వాహకులకు ఖర్చుల భారం అధికమవుతోందన్నారు. అలాగే హైద రాబాద్–విజయవాడ మధ్య కొత్తగా రోజువారి ప్యాసింజర్ రైలును మంజూరు చేయాల్సిందిగా కోరారు. మాచర్ల, మట్టంపల్లి, జన్పహాడ్, దామరచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ టౌన్ల మీదుగా ఈ కొత్త రైలును నడపాలని కోరారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా కేటీఆర్ వెంట తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. -
ఇప్పుడే గుర్తొచ్చిందా?!
- ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలపై సర్కారుకు వల్లమాలిన ప్రేమ - గ్రామీణ రోడ్లకు రూ.63 కోట్లు విడుదల - మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం - బనగానపల్లె పనుల్లో జాప్యం కర్నూలు(అర్బన్): త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నంద్యాల నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వానికి వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చింది. పట్టణ ఓటర్ల నుంచి సానుభూతి పొందేందుకు ఓ వైపు మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల పనులు చేపడుతూనే.. మరో వైపు పల్లె ప్రజల ఓట్లకు గాలం వేసేందుకు నంద్యాల రూరల్, గోస్పాడు మండలంలో కూడా పనులను షురూ చేసింది. నంద్యాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచిన భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మూడేళ్ల నుంచి నంద్యాల అభివృద్ధిపై శీతకన్ను వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఉప పోరులో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిలప్రియతో పాటు మంత్రులు కాలవ శ్రీనివాసులు, నారాయణ వారంలో రెండు రోజులు అక్కడే తిష్టవేసి పార్టీ వ్యవహారాలతో పాటు పలు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ నెల 3న జరిగిన సమావేశంలో నంద్యాల రూరల్, గోస్పాడు మండలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు రూ.63 కోట్లు విడుదల చేస్తూ.. మూడు నెలల్లో ఈ పనులు పూర్తి కావాలని సంబంధిత ఇంజినీర్లకు దిశానిర్దేశం చేశారు. నంద్యాల రూరల్ మండలం, గోస్పాడు మండలంలో వేర్వేరు దశల్లో ఉన్న 45 అంగన్వాడీ కేంద్రాలు, 19 గ్రామ పంచాయతీ భవనాలతో పాటు 45 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను పూర్తి చేసేందుకు రూ. 19 కోట్లను విడుదల చేశారు. అలాగే ఈ రెండు మండలాల్లో దాదాపు 100 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేసేందుకు రూ.44 కోట్లను విడుదల చేశారు. ఎంతో కాలంగా ఈ పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిధులు విడుదల చేసిందని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బనగానపల్లె పనుల్లో జాప్యం ... నంద్యాలకు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఇతర నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇటీవలే బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు సంబంధించి 15 పనులకు రూ.8.43 కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయంలో నివేదికలు అందించినట్లు సమాచారం. ఆ నివేదికలు జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయానికి రాగా, సంబంధిత ఇంజినీర్లు అంచనాలు రూపొందించి తిరిగి ప్రభుత్వానికి పంపారు. ఇంకా వాటికి ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. అలాగే పలు నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన రోడ్ల పనులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. -
ప్రత్యేక హోదాతోనే రాష్ర్టాభివృద్ధి
అనంతపురం న్యూటౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని బీసీ జనసభ యువజన సంఘం అధ్యక్షులు సగర పవన్‌కుమార్ అన్నారు. ఆదివారం జనసభ జిల్లా కార్యాలయంలో యువజన కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పవన్‌కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం హోదా ఇస్తామని చెప్పి తీరా ఇప్పుడు ప్యాకేజీ రాగం అందుకోవడం తెలుగు వారిని మోసగించడమేనన్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత లేదని హోదాతో మాత్రమే అనేక రాయితీలు వస్తాయని, పరిశ్రమలు విరివిగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. తమిళులు జల్లికట్టు కోసం చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరులో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామ్మోహన్, రమేష్, తరుణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగావకాశాలు
ఎస్వీఐటీ కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి రాప్తాడు : నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయని ఎస్వీఐటీ కళాశాల చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి అన్నారు. కళాశాలలో ఆదివారం ఆన్లైన్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. బీటెక్ ఫైనల్ విద్యార్థులు ఆన్లైన్ప పరీక్షలకు హాజరయ్యారు. సి.చక్రధర్‌రెడ్డి మాట్లాడుతూ సబ్జెక్టులో నాలెడ్జీ ఉన్నా ప్రాక్టికల్ నాలెడ్జి లేకపోవడంతో విద్యార్థులు వెనుకబడుతున్నారన్నారు. పోటీ పరీక్షల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానంతోపాటు, నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు సబ్జెక్టుతోపాటు వారితో నూ తన అంశాలపై పరిశోధనలు చేయించాలని సూచించారు. అనం తరం ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి, ఇంటర్వూ ్యలను ఎలా ఎదుర్కోవాలి, తదితర అంశాలపై అవగాహన కల్పిం చారు. ప్లేస్మేంట్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, ఏవో మథు సూద¯ŒSరెడ్డి, పీడీ శ్రీనివాసుల నాయక్, సిబ్బంది, పాల్గొన్నారు. -
6 నుంచి ‘బడి రుణం..తీర్చుకుందాం’
కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో మంది చదివి నేడు ఉన్నత స్థానాల్లో స్థిర పడి ఉంటారు. అలాంటి వారందరూ తను చదివిన స్కూల్ రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాలోని 54 మండల కేంద్రాల్లో పాఠశాల విద్యార్థులతో బడి రుణం తీర్చుకుందాం రండి.. అంటూ ర్యాలీలు నిర్వహించనున్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏజేసీ రామ స్వామి, డిప్యూటీ ఈఓ తహెరాసుల్తానా, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ జయ రామకృష్ణారెడ్డిలు ర్యాలీల పోస్టర్లను ఆవిష్కరించారు. మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు ఎస్ఎస్ఏ అధికారులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. సహాయం చేస్తే...నోటిస్ బోర్డులలో దాతల పేర్లు స్కూల్ అబివృద్ధి కోసం 10 నుంచి 20 లక్షల రూపాయలను సహయం చేసే వారి పేర్లను నోటీస్ బోర్డులలో చిరకాలం ఉండిపోయేలా రాస్తారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఒక పుస్తకంలో పక్కాగా లెక్కలు రాస్తారు. దాతల పేర్లు, ఫోటోలు ఠీఠీఠీ.టట్చ్చp.జౌఠి.జీn అనే వెబ్సైట్లో పొందుపరుస్తారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
కోదాడఅర్బన్: కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బీక్యాతండా నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించిన సీసీరోడ్లను, గణపవరంలో ఎస్ఎఫ్సీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీక్యాతండాలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకుడు ఇస్లావత్ పీర్యానాయక్ కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డేగ రాణి, ఎంపీటీసీలు కొండపల్లి వాసు, ఇర్ల అన్నపూర్ణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బానోతు అంబేద్కర్, చిట్టా వెంకట్రామమ్మ ఎంపీడీఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, సీడీపీఓ కృష్ణకుమారి, పీఆర్ ఏఈ లక్ష్మారెడ్డి, నాయకులు రాంరెడ్డి, సీతారాంరెడ్డి, పలువురు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
నడిగూడెం: కోదాడ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావులు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లోని రహదారుల అభివద్ధికి రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపినట్లు ,అలాగే రూ.40 కోట్లతో రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల్లో జలకళ కన్పిస్తుందన్నారు.ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, పాలడుగు ప్రసాద్, తదితరులున్నారు. -
సైన్స్ ద్వారానే దేశాభివద్ధి సాధ్యం
నల్లగొండ టూటౌన్ : దేశం అభివృద్ధి సైన్స్ ద్వారానే సాధ్యమవుతుందని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. ఆదివారం జూనియర్ కళాశాల బాలికల వసతి గృహంలో జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవ ప్రగతి సైన్స్ పాత్ర అంశంపై సెమినార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం సైన్స్, స్వావలంభన కోసం సైన్స్ అనే లక్ష్యంతో ప్రజలకు సైన్స్ పట్ల అవగాహన కల్పించి మూఢనమ్మకాలను పారదోలాలన్నారు. అందరికి విద్య, అందరి బాధ్యత అనే నినాదంతో సాక్షరత ఉద్యమంలో జేవీవీ కీలకపాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెంపొందించాలంటే సైన్స్ శాస్త్రీయంగా బోదించాలన్నారు. జేవీవీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు, విద్యార్థులు, మేధావులు ప్రొత్సహించి సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రొఫెసర్ కృష్ణమరాజునాయుడు మాట్లాడుతూ సైన్స్‌ను శాస్త్రీయంగా బోధించి విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రమేశ్, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్.రత్నాకుమార్, నాగమణి, అజీజ్, రమ్యప్రభ, వెంకటనర్సమ్మ, సత్యనారాయణ,ప్రొఫెసర్ ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రవీణమ్మ, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
భారత్ వేగంగా అభివృద్ది చెందుతోంది
-
నైపుణ్యం పెంపొందించుకోవాలి
ట్రిపుల్ ఐటీ ఉపకులపతి సత్యనారాయణ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ బాసర : ఎన్ఎస్ఎస్ వలంటీర్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి ఎంఎస్ఎన్ రెడ్డి అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ‘యూనివర్సిటీ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్’ శిక్షణ కార్యక్రమాన్ని ట్రిపుల్ఐటీ ఉపకులపతి ఎస్.సత్యనారాయణ సూచన మేరకు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా హాజరై విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ పుట్టుక, పనితీరు, విద్యా సంస్థలు, ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లను ఏ విధంగా నిర్వహించాలో వివరించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నైపుణ్యాన్ని సాధించే విధానాన్ని తెలిపారు. భాషా, వత్తి, జీవన విధానం, సాంకేతిక పరమైన నైపుణ్యాలు, మెళకువలు పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డి.శ్యాంబాబు మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు నైపుణ్య అభివద్ధిపై మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిచే సందేశాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, అనిత, నరేష్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
సీపీఐ బలోపేతానికి కృషి చేయాలి
చిలుకూరు: గ్రామాల్లో సీపీఐ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని బేతవోలు గ్రామంలో జరగిన పార్టీ నిర్మాణ మహసభలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు సమన్వంతో పని చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ చేసే నిర్ణయాలు కింది స్థాయిలో కార్యకర్తలకు చేరాలని నాయకులకు సూచించారు. ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగే తెలంగాణ విముక్తి వారోత్సవాల్లో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 11న రాత్రి చిలుకూరుకు తెలంగాణ బస్సు యాత్ర చేరుకుంటుందని అన్నారు. కార్యక్రమంకు ముందు పల్లా వెంకట్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కొండా కోటయ్య, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను, నంధ్యాల రామిరెడ్డి, పుట్టపాక శ్రీనివాస్, చేపూరి కొండల్, సర్పంచ్‌లు సుల్తాన్ వెంకటేశ్వర్లు, తాళ్లూరి పద్మా శ్రీనివాస్, రెమిడాల రాజు జయసుధ, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, మండల , గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అమరచింతను అభివృద్ధి చేసుకుందాం
– అఖిలపక్షం నాయకులతో దేశాయి ప్రకాష్‌రెడ్డి ఆత్మకూర్ (నర్వ) : నూతనంగా ఏర్పడనున్న అమరచింత మండలంలో సాగు, తాగునీటితో పాటు మంచివిద్య అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల సహకారం అవసరమని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డి కోరారు. ఆదివారం అమరచింత గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ పురం వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్షం సమావేశానికి ఆయన ముఖ్య అతి«థిగా హాజరై మాట్లాడారు. కొత్త మండలాల ఏర్పాటులో అమరచింతకు ప్రాధాన్యత కల్పించేవిధంగా కషి చేసిన మంత్రులు జూపల్లి కష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి అఖిలపక్షం తరపున కతజ్ఞతలు తెలిపారు. కొంతమంది పనిగట్టుకొని అమరచింత గ్రామంపై నిందలు వేస్తున్నారని అలాంటివారి ఆలోచనలను తిప్పికొడుతూ అమరచింత ప్రేమను పంచే గ్రామమని తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అమరచింత మండల పరిధిలోకి వచ్చే గ్రామాలకు సాగునీరు, తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం కల్పించి అన్ని గ్రామాల ప్రజలకు సమాన దష్టితో వ్యవహరించి పనులు చేస్తామన్న భరోసాను ఆయా గ్రామాల ప్రజల్లో కల్పించాలని సూచించారు. విమర్శలు, ప్రతి విమర్శలు పక్కనపెట్టి కొత్త మండల అభివద్ధికి సహకరించడానికి తానుకూడా గ్రామస్తుడిగా చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులతో పాటు ఎంపీటీసీ సభ్యుడు విష్ణు, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కేన్సర్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి
- ఆస్పత్రిని పరిశీలించిన సీపీఐ జిల్లా నేతలు అనంతపురం: అనంత శివారులోని కేన్సర్ ఆస్పత్రిని సీపీఐ నేతల బృందం శుక్రవారం పరిశీలించింది. ఆస్పత్రి అందిస్తున్న వైద్య సేవలు, ఎలాంటి లోపాలున్నాయి, ఇంకా ఎలాంటి వైద్య పరికరాలు కావాలన్న విషయాలను వైద్యులు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడారు. క్యాన్సర్ ఆస్పత్రి జిల్లా కేంద్రంలో ఉందంటే చాలా సంతోషించామని తెలిపారు. ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెడికల్ కళాశాల ఆవరణలో మంచి అధునాతన భవనాలు ఉన్నా కేన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు సరైన వైద్యులు, సిబ్బంది లేరన్నారు. వ్యాధి నిర్థారణకు అవసరమైన అధునాతన రేడియేషన్ మిషన్, ఆపరేషన్ థియేటర్, మెమోగ్రాఫ్, ఎక్స్‌రే, సిటీస్కాన్, ఎంఆర్ఐ, పెట్‌స్కాన్, రక్త పరీక్షలు అంబులెన్స్ తదితర మిషన్లు ఆస్పత్రిలో లేవన్నారు. కేవలం ఇద్దరు డాక్టర్లు, ఒక టెక్నీషియన్ మాత్రమే ఉన్నారన్నారు. దీంతో రోగులకు వారు మెరుగైన సేవలందించడం ఎలా సాధ్య పడుతుందని అన్నారు. కేన్సర్ ఆస్పత్రిలోనే సర్జికల్ అంకాలజిస్ట్, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్లను తక్షణం నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. నగర కార్యదర్శి సి.లింగమయ్య, అల్లీపీరా, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రాజేష్‌గౌడ్, మహిళా సమాఖ్య నగర అధ్యక్ష, కార్యదర్శులు పద్మావతి పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణకు కృషి
– ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు ఆమనగల్లు: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం కృషి చేస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో గురువారం నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కారు చర్యలు తీసుకోవాలని, భవనాలు నిర్మించడమే కాకుండా మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినేలా విద్యాశాఖ మంత్రి కడియం చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. నవంబర్‌లో ఎస్టీయూ 70 ఏళ్ల వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి, నాయకులు సదానందం గౌడ్, రవి,శివప్రసాద్,కిష్టారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సమద్, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణ, యూనిస్, పాషా, పర్వత్‌రెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు. -
ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
రాప్తాడు: ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని, తద్వారా మేధాశక్తిని సంపాదించవచ్చని మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ)లో కళాశాల డైరెక్టర్ చక్రధర్‌రెడ్డి అధ్యక్షతన ఫైనల్ ఇయర్ ఈసీఈ, ఈఈఈ చదువుతున్న విద్యార్థులకు రెండు రోజుల పాటు మ్యాట్ ల్యాబ్‌పై వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ హజరై మ్యాట్ ల్యాబ్‌లోని పరికరాలు ఎలా పనిచేస్తాయి.. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటి ద్వారా ఎలా టెక్నాలజీని అభివృద్ధి చే యాలనే అంశాలపై విద్యార్థులకు ప్ర యోగాల ద్వారా అవగాహన కల్పిం చారు. అలాగే మ్యాట్ ల్యాబ్‌పై విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు నూతన ప్రయోగాలు చేస్తూ సరికొత్త ఒరవడికి నాందీ పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సి.చక్రధర్‌రెడి, కళాశాల ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి, ఏఓ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, హెచ్ఓడీ ఎస్ఎల్వీ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అభివృద్ధికి కృషి చేయాలి
-వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి పెబ్బేరు : గ్రామగ్రామాన వైఎస్సార్ సీపీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఎన్నో అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ అభివద్ధి జరగాలని, అందరూ కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దేవాచారి, నాయకులు చంద్రశేఖర్, విజయ్‌కుమార్ రెడ్డి, కష్ణయ్య, చింతలయ్య, భానుప్రకాష్, జయరాం, భరత్, బాలచంద్రి తదితరులు పాల్గొన్నారు. -
స్విమ్స్ వైద్య సేవల విస్తరణ
–అన్ని వైద్య విభాగాల్లో కొత్త పరికరాల ఆవిష్కరణ –క్యాన్సర్ రోగులకు 2వ సత్రంలో వసతి సదుపాయం – టీడీపీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి మెడికల్ : శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) వైద్య సేవలు రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందేలా అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. స్విమ్స్‌లో శుక్రవారం సాయంత్రం నూతన రేడియేషన్ ఆంకాలజి వార్డు, మెడకిల్ ఆంకాలజి వార్డు, బ్రాకీ వార్డు, బ్రాకీ థెరపీ, కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆంకాలజీ విభాగాల అధునాతన వైద్య పరికరాలను చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చదలవాడ మాట్లాడుతూ వైద్య సేవలను మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్నిరకాల ఆర్థిక సదుపాయాలను టీటీడీ సమకూరుస్తుందని తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల వసతి కోసం టీటీడీ 2వ సత్రంలో 50 గదులను స్విమ్స్‌కు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం కింద లభించే విరాళాలతో మరింత ఆర్థిక సహాయాన్ని స్విమ్స్‌కు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి రూ.30 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని, దీనిని రూ.40 నుంచి రూ.70 కోట్లకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. క్యాన్సర్ రోగుల కోసం టీటీడీ సత్రంలో గదులు కేటాయించడంపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. -
దళిత వాడలను అభివృద్ది చేయాలి : మట్టిపల్లి
సూర్యాపేటరూరల్ : దళిత వాడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్రకమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. శుక్రవారం రాయినిగూడెం, కేసారం, కాసరబాద, ఇమాంపేట, దాసాయిగూడెం గ్రామాల్లో చేపట్టిన దళితుల ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో ఆయన మాట్లాడారు. చాలా వరకు గ్రామాల్లో దళితులు చనిపోతే బొంద పెట్టడానికి శ్మశానస్థలం లేక నేటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నల్లమేకల అంజయ్య, నాయకులు రణపంగ జయబాబు, చింత భిక్షం, కామళ్ల లింగయ్య, బొస్క సోమయ్య, దైద దానేలు, పాముల కృష్ణ, పాముల ఉపేందర్, నకిరేకంటి రాములు, మామిడి సైదులు, బోయిళ్ల వెంకటయ్య, బండారు వెంకటయ్య, గోపి, తదితరులు పాల్గొన్నారు. -
విశ్వమంత విజన్
సాక్షి, హైదరాబాద్: రాజధాని అభివృద్ధికి రూ.83,950 కోట్లు.. వచ్చే 30 ఏళ్లకోసం భారీ ప్రణాళికలు అందమైన, ట్రాఫిక్ జంఝాటం లేని సువిశాలమైన రోడ్లు. సుఖమయ ప్రయాణానికి కావాల్సిన సర్వ సదుపాయాలు. పేదలకు చూడచక్కని డబుల్ బెడ్రూం ఇళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ, పరిసర జిల్లాలకు శరవేగంగా చేరుకునేందుకు అత్యాధునిక రహదారులు, స్కైవేలు... హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు, నగర జీవనాన్ని సాఫీగా మార్చేందుకు ఉద్దేశించిన బృహత్తర ‘విశ్వనగర’ ప్రాజెక్టు లక్ష్యాలివి. రానున్న 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న గ్రేటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల విలువెంతో తెలుసా..? అక్షరాలా రూ.83,950 కోట్లు! వీటిలో తెలంగాణలోని 35 స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరాకు రూ.2,300 కోట్లు మినహాయిస్తే మిగతా నిధులన్నీ గ్రేటర్‌పై వెచ్చించబోయేవే!! ఈ భారీ నిధులను హడ్కో, పలు అంతర్జాతీయ సంస్థలు తదితర మార్గాల ద్వారా సేకరించనున్నారు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో ముఖ్యమైనవి... ► మిషన్ హుస్సేన్‌సాగర్ ► కూకట్పల్లి,సనత్‌నగర్ ప్రాంతాల నుంచి రోజూ సాగర్‌లోకి వచ్చి చేరుతున్న400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలను అంబర్పేట్ ఎస్టీపీకి దారి మళ్లించడం. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. ► జలాశయం నీటి నాణ్యతను మెరుగుపరచడం, ఘన వ్యర్థాలు చేరకుండా చూడటం ► నాలుగు నాలాల నుంచి వచ్చి చేరుతున్న మురుగునీటిని మళ్లించడం ► జలాశయంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ► నీటిని ల్యాండ్ స్కేపింగ్,గార్డెనింగ్ అవసరాలకు వాడుకునేలా శుద్ధి చేయడం ► పికెట్ నాలా వద్ద నీటి శుద్ధికి 30 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగుశుద్ధి కేంద్రం నిర్మాణం ► హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్డీ ఎస్టీపీ అధునీకరణ ► రంగధాముని చెరువు వద్ద 5 ఎంఎల్డీ సామర్థ్యంతో మినీ ఎస్టీపీ నిర్మాణం ► సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ట్రంక్ సీవర్ మెయిన్స్ నిర్మాణం విశ్వ’ ప్రణాళిక సమగ్ర స్వరూపం అంశం వ్యయం (రూ. కోట్లలో) 1. మొత్తం రహదారులు (ఎస్సార్డీపీ+కౌంటర్ మాగ్నెట్స్) 25,783 2 ఈస్ట్ వెస్ట్ మూసీ రోడ్డు (ఫేజ్ 1+ఫేజ్ 2) 7,775 3. హెచ్ఎండీఏలో గ్రిడ్ రోడ్లు 6,000 4. టీవోజీసీల్లో మౌలికసదుపాయాలు 13,998 5.పీపీపీ విధానంలో మోడర్న్ ఎఫ్‌ఓబీలు 42 6. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ 2,966 7.స్లమ్స్, ఖాలీ ప్రదేశాల్లో డబుల్ బెడ్రూమ్ఇళ్లు 7,788 8. జీహెచ్ఎంసీలో శ్మశానవాటికల అభివృద్ధి 25 9. హుస్సేన్‌సాగర్ శుద్ధి 1,415 10.తాగునీటి సరఫరా, సివరేజి 10,231 11. తెలంగాణలోని 35 యూఎల్బీల్లో తాగునీటి సరఫరా 2,300 12. వరద కాలువలు 6,900 అత్యాధునిక రోడ్లు... హైదరాబాద్ నుంచి పరిసర జిల్లాల్లో ఏర్పాటయ్యే శాటిలైట్ టౌన్షిప్ (కౌంటర్ మాగ్నెట్)లను చేరుకునేందుకు రోడ్లు, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా సిగ్నల్ ఫ్రీ మార్గాలకు మొత్తం రూ.25,783 కోట్లు వెచ్చిస్తారు. వీటిలో 11 కౌంటర్ మాగ్నెట్ల వరకు రోడ్లు మార్గాలకే రూ.10,629 కోట్లు, ఎస్సార్డీపీ పనులకు రూ.15, 154 కోట్లు కావాలని అంచనా. బీఆర్టీఎస్... నగరానికి నాలుగు వైపులా బస్సుల కోసం ప్రత్యేకమైన 438 కి.మీ. మేర విశాలమైన బీఆర్టీఎస్ రోడ్లు నర్సాపూర్, తుర్కపల్లి, షామీర్పేట, ఇబ్రహీంపట్నం, బొంగులూరు, గుమ్మడిదల, కందుకూరు తదితర మార్గాల్లో వీటి నిర్మాణం దాహార్తి, మురుగు కష్టాలకు10,231 కోట్లు గ్రేటర్‌తో పాటు రింగ్‌రోడ్డు లోపలున్న 187 గ్రామ పంచాయతీల పరిధిలో దాహార్తిని తీర్చే బాధ్యతలనూ ప్రభుత్వం ఇటీవలే జలమండలికే అప్పజెప్పింది. ఇందుకు రూ.10,231 కోట్లు కావాలంటూ జలమండలి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. కేశవాపూర్, మల్కాపూర్‌లలో భారీ రిజర్వాయర్లు జీహెచ్ఎంసీ, శివార్లలో మురుగునీటి పారుదల, నీటి సరఫరా వ్యవస్థలు రింగ్‌రోడ్డు లోపలున్న పంచాయతీలకు నీటి సరఫరాకు రూ.606 కోట్లు మెట్రో మెరుపులు మెట్రో రైల్ మార్గాన్ని 2041 నాటికి 417 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. తొలి దశ కింద ప్రస్తుతం చేపట్టిన 72 కి .మీ.ని పూర్తి రెండో దశలో మరో 83 కి.మీ. మేరకు విస్తరిస్తారు. సంగారెడ్డి, చౌటుప్పల్, కందుకూర్, మేడ్చల్, కీసర, ఘట్కేసర్, ఉస్మాన్‌సాగర్, శ్రీశైలం రోడ్డు తదితర ప్రాంతాలకు మెట్రోను పొడిగిస్తారు ఎంఎంటీఎస్.... రెండో దశ కింద ఆరు మార్గాల్లో 84 కి.మీ. మేర చేపట్టిన ఎంఎంటీఎస్‌ను 2041 నాటికి 428 కి.మీ. మేరకు పొడిగింపు 2041 నాటికి తూప్రాన్, మనోహరాబాద్, మేడ్చల్, భువనగరి, బీబీనగర్, రాయగిరి, కొత్తూరు, షాద్‌నగర్ తదితర మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ రూ.2965.52 కోట్లతో మూసీకి సొబగులు మురికికూపంగా మారిన మూసీని ప్రక్షాళించి సుందరీకరిస్తారు. నదికి ఆనుకుని సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల కోసం వాక్ వేలు, ఆహ్లాదం పంచేందుకు పచ్చని చె ట్లతో గ్రీన్ స్పేస్‌ను అభివృద్ధి చేస్తారు. తారామతి బారాదరి నుంచి ప్రత్యేకంగా వాక్‌వేను అభివృద్ధి చేయనున్నారు జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు 19 కి.మీ మార్గంలో సుందరీకరణ బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జివరకు 21.5 కి.మీ మార్గంలో సుందరీకరణ నాగోల్ బ్రిడ్జి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు (గౌరెల్లి వరకు) 15 కి.మీ. మార్గంలో సుందరీకరణ రెండు దశల్లో మూసీ స్కైవే ఎస్సార్డీపీ పనుల్ని నాలుగు దశల్లో చేయనున్నారు. తొలి దశలోని కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయి. తొలి దశలో 18 జంక్షన్లు, రెండో దశలో మూసీ స్కైవే 2 దశలు, మూడో దశలో ఆరు కారిడార్లు, నాలుగో దశలో 9 కారిడార్లున్నాయి మూసీ తొలి దశలో నాగోల్ నుంచి రింగ్ రోడ్డు పడమర వరకు స్కైవే (25.5 కి.మీ.), తూర్పు నుంచి నాగోల్ వరకు రేడియల్ రోడ్డు (15.5 కి.మీ) రెండో దశలో రింగ్ రోడ్డు తూర్పు నుంచి నాగోల్ వరకు స్కైవే (15.5కి.మీ) తొలి దశకు రూ.5,916 కోట్లు, రెండో దశకు రూ.1,859 కోట్లు... మొత్తం రూ.7,775 కోట్ల వ్యయం -
'బెంగాల్‌ను అభివృద్ధిపరిచే సత్తా తమకే ఉంది'
-
చైనాలా అభివృద్ధి చేస్తా
శక్తివంతమైందిగా తీర్చిదిద్దుతా: సీఎం చంద్రబాబు ఉద్ఘాటన సాక్షి, హైదరాబాద్: ‘‘చైనా 1978లో పేద దేశం. కమ్యూనిస్టు దేశమైన చైనా 1991లో ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. స్పీడ్(వేగం), స్కేల్(కొలమానం), స్కిల్స్(నైపుణ్యం)లను అందిపుచ్చుకుని ప్రపంచంలో శక్తిమంతమైన దేశంగా అభివృద్ధి చెందింది. గత 24 ఏళ్లలో 68 శాతం సంపదను ఆ దేశం సృష్టించగలిగింది. హార్డ్‌వేర్, రైల్వే, నిర్మాణ, నీటిపారుదల రంగాల్లో ప్రపంచంలో చైనా ప్రథమస్థానంలో ఉంది. చైనా ఇదే స్థాయిలో అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టక తప్పదు. ప్రపంచంలో ఒక్క భారతదేశం.. అందులోనూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశం. చైనా ప్రభుత్వంతో 17.. ప్రైవేటు సంస్థలతో 12 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందాల మేరకు రాష్ట్రంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చైనా ముందుకొస్తుందని ఆశిస్తున్నాం. చైనా స్ఫూర్తితో రాష్ట్రాన్ని శక్తిమంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆరురోజుల చైనా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం శనివారం సచివాలయంలో విలేకరులకు తన పర్యటన విశేషాలను వెల్లడించారు. మన దేశ విదేశీవ్యవహారాల శాఖ, చైనాలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు 30 మంది అధికార, పారిశ్రామికవేత్తల బృందంతో బీజింగ్, చెంగ్డు, షాంఘైల్లో పర్యటించానన్నారు. రాష్ట్రంలోనూ.. రాజధాని అమరావతిలోనూ భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్న తన ప్రతిపాదనకు చైనా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. సరిహద్దు వివాదాన్ని కొట్టిపారేసిన బాబు: మనదేశంతో చైనాకు సరిహద్దు వివాదం ఉండటం.. పాకిస్థాన్‌కు చైనా ఆర్థికసాయం చేస్తున్నందున.. ఆ దేశం మనరాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్న నమ్మకం మీకుందా? అని ప్రశ్నించగా.. దాన్ని కొట్టిపారేశారు. ప్రధాని కూడా త్వరలో అక్కడ పర్యటిస్తారని చెప్పారు. సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ఇవ్వగానే సింగపూర్, జపాన్, చైనాల సహకారంతో రాజధాని నిర్మిస్తామని తెలిపారు. భూగర్భజలాల పెంపునకు కన్సల్టెన్సీ! రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచేందుకుగాను కన్సల్టెన్సీలను పెట్టుకొని వారి సూచనలు పాటించాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు.శనివారం ఆయన నీరు-చెట్టు కార్యక్రమం అమలు ప్రగతిని సమీక్షించారు. మరో సమీక్షలో అకాల వర్షాలపై చర్చించారు. రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు : ఈ నెల 20 నుంచి పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. తన జన్మదినం రోజైన ఈ నెల 20న సీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నారు. అనంతరం 21న ముస్సోరిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. 23న మహబూబ్‌నగర్ లో జరిగే కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. 24న విశాఖజిల్లాలో ఇండస్ట్రియల్ మిషన్‌ను ప్రారంభిస్తారు. 29న ఢిల్లీ వెళ్లనున్నారు. అద్దె ఇంటికి మారిన చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అద్దెంటికి మారారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 65లోని సొంతింటిని కూల్చేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ కారణంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 24లో తీసుకున్న అద్దె ఇంటికి మకాం మార్చారు. చైనా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి అద్దె ఇంటికెళ్లారు. కొత్త భవన నిర్మాణం పూర్తయ్యేదాకా ఆయన ఇక్కడే ఉంటారు. కాగా బాబు భద్రతకు అడ్డంకిగా మారొచ్చనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 24 పరిసరాల్లో ఉన్న బడ్డీ కొట్లతోపాటు చిన్న చిన్న దుకాణాల్ని జూబ్లీహిల్స్ పోలీసులు తొలగించారు. -
చీర్యాల దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తాం
శ్రీ లక్ష్మీనృసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీసర: చీర్యాల శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధిపర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల లక్ష్మీనృసింహస్వామి సప్తమ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవానికి ఆయన హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు దేవస్థానం వేద పండితులు స్వామివారి ఆశీర్వచనం, మహాప్రసాదాన్ని అందజేశారు. భక్తుల సౌకర్యార్థం రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 42 గదుల వసతి గృహాన్ని, చీర్యాల చౌరస్తాలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన స్వాగత ద్వారాన్ని సీఎం ప్రారంభించారు. చీర్యాల దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేవస్థానానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ రఘునందన్‌రావుకు సీఎం ఆదేశించారు. సీఎం వెంట మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, బాబూమోహన్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులున్నారు. -
మెట్రో మార్గాల్లో రోడ్ల విస్తరణ
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు మార్గాల్లో రహదారుల విస్తరణకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ రూ.10 కోట్లతో చర్యలు చేపట్టింది. ఈ నిధులతో బీటీ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త్వరలో మెట్రో పోలిస్ సమావేశాలు జరుగనున్న దృష్ట్యా నగరంలోని మెట్రో రైలు మార్గాల్లో అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్, వివిధ విభాగాల అధికారులు శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మెట్రో మార్గాల్లో రహదారుల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆర్అండ్బీ మార్గాల్లో బీటీ రోడ్ల విస్తరణతో పాటు, జీహెచ్ఎంసీ మార్గాల్లో కూడా రహదారుల విస్తరణ చేపడతారు. మెట్రో పనుల కోసం చేపట్టిన ఫౌండేషన్ పనులు పూర్తయిన జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ మార్గాల్లో బారికేడ్లను తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎల్అండ్టీ సంస్థ చర్యలు తీసుకోవాలి. రోడ్ నెంబర్-36లో పౌండేషన్ పూర్తయిన చోట నాలుగైదు రోజుల్లో ముళ్ల కంచెను తొలగించాలని, పనులు పూర్తయిన చోట నుంచి నిర్మాణ సామగ్రిని సైతం తరలించాలని ఇంజినీర్లను హెచ్ఎంఆర్ ఎండీ ఆదేశించారు. అలాగే, ఈ మార్గాల్లో ఉన్న చెత్త, ఇతర భవన నిర్మాణ సామగ్రిని వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ చీఫ్ సిటీ ప్లానర్, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ మార్గాల్లో ఉన్న వాటర్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వాటర్ బోర్డు అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో వాటర్ బోర్డు ఎండీ జగదీశ్వర్, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రద్యుమ్న, సైబరాబాద్ డీసీపీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు. -
ఫస్ట్ డెవలప్ ఇండియా..
-
ఏపీ, తెలంగాణల్లో పర్యాటకానికి మహర్దశ!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక కేంద్రాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడిన ఆయా కేంద్రాల అభివృద్ధికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలూ అభివృద్ధి చెందనున్నాయి. మెగా సర్క్యూట్ విభాగంలో వరంగల్-కరీంనగర్, కొండపల్లి - ఇబ్రహీంపట్నం, సర్క్యూట్ విభాగంలో.. రాచకొండ కోట-ఆరుట్ల(దేవాలయం)-రంగాపూర్ వేదశాల-గాలిషాహీద్ దర్గా-అల్లాపురం గ్రామం(దేవాలయాలు), నారాయణపూర్ (దేవాలయాలు), శివన్న గూడెం రాక్ ఫార్మేషన్స్- వ్యాలీ ఆఫ్ బంజారా సర్క్యూట్స్, గుంటూరులోని గుత్తికొండ బిలం గుహలు, పిడుగురాళ్ల-కొండవీడు ఖిల్లా- కోటప్పకొండ గుడి సర్క్యూట్, శ్రీకాకుళంలోని బుద్ధ సర్క్యూట్లు ఉన్నాయి. పర్యాటక గమ్యస్థానాల విభాగంలో నాగార్జున సాగర్, హైదరాబాదులోని దుర్గంచెర్వు, థీమ్ పార్క్‌ల అభివృద్ధి, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఖిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి, కరీంనగర్‌లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలం బీచ్ అభివృద్ధి, నల్లగొండ జిల్లాలోని పానగల్ గుడి, ఉదయసముద్రం ప్రాంతాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. కాకతీయ, కాకినాడ బీచ్, లేపాక్షి, ఫ్లెమింగో, తారామతి బరాదరి ఉత్సవాల నిర్వహణ ప్రాధామ్యాలుగా పెట్టుకున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీపద్ యశోనాయక్ మంగళవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. -
గ్రూపులొద్దు
ఎమ్మెల్యేలకు సీఎం హితవు రహస్య సమావేశాలపై అసంతృప్తి ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయొద్దని క్లాస్ సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని సలహా మంత్రులపై ఆరోపణలు చేయడం తగదని సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు, విందులు, వినోదాలను ఏర్పాటు చేస్తుండడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ఏవైనా సమస్యలుంటే పార్టీ వేదికపైనే చర్చించుకోవాలని సూచించారు. నియోజక వర్గాల్లో సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలని కోరారు. లేనట్లయితే కేపీసీసీ అధ్యక్షుడిని కూడా కలుసుకోవచ్చని సూచించారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. తమ పనులు జరిగి తీరాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టడం సరికాదని హితవు పలికారు. చట్టం పరిధిలో తాము పని చేయాల్సి ఉంటుందని, కనుక కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉండకపోవచ్చని వివరించారు. అలాంటి సందర్భాల్లో మంత్రులపై ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు. మంగళవారం రాత్రి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో సమావేశం కావడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇకమీదట ఇలాంటి పొరపాట్లు చేయవద్దని సలహా ఇచ్చారు. మంత్రులు కూడా ఎమ్మెల్యేలను విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై ఆయా ఎమ్మెల్యేలతో చర్చించాలని, స్థానిక సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావాలని ఆదేశించారు. పేదలకు త్వరలో ఇళ్లు వివిధ పథకాల కింద ఇళ్ల పంపిణీకి సంబంధించి లోటు పాట్లను నివారించి, అర్హులైన పేదలకు సత్వరమే వాటిని ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ పథకాలకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఎమ్మెల్యేలకు ఫిబ్రవరిలో కూడా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఇళ్ల పంపిణీని చేపడతామన్నారు. సమావేశం తర్వాత సీఎల్పీ కార్యదర్శి సీఎస్. అప్పాజీ నాడగౌడ విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రయ, బసవ వసతి సహా వివిధ పథకాల కింద మూడు లక్షల ఇళ్ల పంపిణీ నిలిచిపోవడంపై ఎమ్మెల్యేలు సమావేశంలో ప్రస్తావించారని తెలిపారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తానని సీఎం భరోసా ఇచ్చారని చెప్పారు. -
రహదారుల అభివృద్ధికి అటవీశాఖ అడ్డంకులు
భద్రాచలం, న్యూస్‌లైన్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల మారుమూల గ్రామాలకు చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. నిధులు ఉన్నప్పటికీ అటవీశాఖ అడ్డంకుల కారణంగా పల్లె రహదారులు పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. రహదారుల నిర్మాణంతో అడవులు అంతరించిపోతాయని కొన్ని చోట్ల ఈ పనులకు అటవీశాఖ కొర్రీలు పెట్టింది. ఇందుకు సంబంధించి ‘న్యూస్‌లైన్’ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం దశల వారీగా జిల్లాకు సుమారుగా 6 వందల కోట్లకు పైగానే నిధులు మంజూరు చేసింది. వీటిని ఆయా శాఖలకు కేటాయించి పనులు చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. వీటిలో ఆర్అండ్బీ శాఖ ద్వారా 10 పనులకు గాను రూ.286.83 కోట్లు, పీఆర్ విభాగానికి మొత్తం 91 పనులకు గాను రూ.91.62 కోట్లు కేటాయించారు. అదే విధంగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ పథకాల కింద వచ్చిన నిధులతో పనులు ప్రారంభించారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఎక్కువగా పీఆర్, ఆర్అండ్బీ విభాగాలకే నిధుల కేటాయింపులు చేశారు. పీఆర్ విభాగం ద్వారా చేపట్టే పనులన్నీ దాదాపు మారుమూల గ్రామాలకు వెళ్లే రహదారులను మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు చేశారు. కానీ అటవీశాఖ అభ్యంతరాలతో ఆ లక్ష్యం నెరవేరని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీ అభివృద్ధికి ఎన్నో సంవత్సరాల తరువాత ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరుకాగా వాటితో పనులు చేయనీయకండా అటవీశాఖ అడ్డగోలు నిబంధనలు విధించటంపై ఈ ప్రాంత గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను స్మగ్లర్లు దోచుకుపోతున్నా పట్టించుకోని ఆ శాఖ అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులను అడ్డుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రధానంగా మారుమూల మండలాలైన వాజేడు, చర్ల, చింతూ రు, గుండాల వంటి మండలాల్లోనే ఎక్కువగా పనులకు అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. ముందుకుసాగని పనులు : భద్రాచలం డివిజన్లోని చింతూరు మండలంలో గల గూడూరు నుంచి కొత్తపల్లి, వాజేడు మండలంలోని జడ్పీ రోడ్డు నుంచి బొమ్మనపల్లి, అలాగే చర్ల మండలంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి తిప్పాపురం వరకు పెద్దమిడిసిలేరు నుంచి కుర్నపల్లి గ్రామాలకు చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అదే విధంగా కొత్తగూడెం డివిజన్ పరిధిలోని గుండాల మండలంలో గల బర్లగూడెం నుంచి రాయిపాడు, కాచనపల్లి నుంచి అనంతోగు, గుండాల నుంచి శెట్టిపెల్లి, ఆళ్లపల్లి నుంచి పెద్దవెంకటాపురం గిరిజన గ్రామాల మధ్య చేపట్టిన రహదారి నిర్మాణ పనులు కూడా ఈ కారణంగానే ముందుకు సాగని పరిస్థితి ఉంది. ఇదే మండలంలోని గుండాల నుంచి సాయనపల్లి వరకూ పనులు పూర్తి అయినప్పటికీ మధ్యలో ఉన్న బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. ఈ పనులన్నీ పంచాయతీరాజ్ విభాగం పర్యవేక్షణలో చేపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2010లోనే ఈ పనులకు నిధులు మంజూరైనప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. అదే విధంగా ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపట్టే భద్రాచలం-రాజమండ్రి రహదారిలో గల 9 కిలోమీటర్ మేర రహదారి, అలాగే బూర్గంపాడు-అశ్వారావుపేట మధ్య చేపట్టే రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. అనుమతుల కోసం ఎదురు చూపులు : రహదారుల నిర్మాణం కారణంగా అటవీ భూములు పోతున్నాయని అటవీశాఖ అభ్యంతరం చెబుతోంది. ఈ మొత్తం పనులను ఆయా ప్రాంతాల్లో చేపట్టేందుకు 40.40 కి.మీ మేర భూమి అవసరం ఉంటుందని అటవీశాఖ అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా భూమిని అటవీశాఖకు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ప్రభుత్వం వారికి అప్పగించాల్సి ఉంటుంది. ఇక్కడి అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అనుమతుల కోసం నివేదికలు పంపించారు. కొన్ని పనులకు తాత్కాలిక అనుమతులు రావటంతో ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో అనుమతులు వస్తేనే పనులను పూర్తి చేసే అవకాశం ఉటుంది. వీటి కోసం ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు ఎదురుచూడాల్సి వస్తోంది. పనులు ప్రారంభించి మూడేళ్లు కావస్తుండంతో చర్ల, వాజేడు, గుండాల వంటి మండలాల్లో కొత్తగా టెండర్లను పిలుస్తున్నారు. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో.. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం ఎన్నటికి కలుగుతుందోనని గిరిజనులు ఎదురు చూస్తున్నారు. పనులు వేగవంతం చేశాం : వెంకటి, ఆర్అండ్బీ ఈఈ, భద్రాచలం అటవీశాఖ అభ్యంతరాల ద్వారా నిలిచిపోయిన పనులకు తాత్కాలిక అనుమతులు వచ్చాయి. దీంతో ప్రస్తుతం పనులను వేగవంతం చేశాము. జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అనుమతుల కోసం ఇప్పటికే నివేదిక పంపించాం. ఏ ఒక్క పనీ కూడా నిలిచిపోకుండా పూర్తి చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.