
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
కోదాడ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావులు తెలిపారు.
నడిగూడెం: కోదాడ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావులు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లోని రహదారుల అభివద్ధికి రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపినట్లు ,అలాగే రూ.40 కోట్లతో రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల్లో జలకళ కన్పిస్తుందన్నారు.ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, పాలడుగు ప్రసాద్, తదితరులున్నారు.