trying
-
రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు: ఖర్గే
బెంగళూరు: దేశ రాజ్యాంగాన్ని మార్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దీనిని సమైక్యంగా ఉండి, గట్టిగా ఎదుర్కోలేకపోతే దేశంలో నియంతృత్వపాలన తథ్యమని ఆయన హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని మార్చేసేందుకు, పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గట్టిగా, ఐక్యంగా నిలబడకుంటే, దేశంలో నియంతృత్వం రావడం ఖాయం. నియంతృత్వం కావాలనుకుంటున్నారా లేక న్యాయంతో కూడిన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా, అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాజ్యాంగం మనుగడ సాధించిన పక్షంలో దేశం ఐక్యంగా ముందుకు సాగుతుంది. ప్రజాస్వామ్యం ఉంటే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించగలుగుతారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించడం లేదు, రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. అందుకే, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, దానికి కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఒక భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని వదులుకుని కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు లేదా ప్రభుత్వాలను ఎందుకు పడగొడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైందని నిలదీశారు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు దేశంలో నియంతృత్వం రావచ్చని అన్నారు. ప్రభుత్వ గ్యారెంటీయే కనీసం బీజేపీ ప్రభుత్వ గ్యారెంటీయే అని చెప్పకుండా మోదీ తన గ్యారెంటీ అని చెప్పుకోవడం ఏమిటన్నారు. ‘అది నీ గ్యారెంటీ ఎలా అవుతుంది? అది నీది కాదు. ప్రజలు డబ్బుతో అమలు చేసే గ్యారెంటీ’’ అన్నారు. -
ప్రేమతో... జామ్
న్యూఢిల్లీ: ఎప్పుడూ రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు గరిటె పట్టారు. తల్లి సోనియాగాంధీతో కలిసి బత్తాయి జామ్ తయారు చేశారు. పెరట్లో పండిన బుల్లి బత్తాయిలతో తయారు చేసిన ఆ జామ్ తనకెంతో ఇష్టమని సోనియా చెప్పారు. ఈ ఆసక్తికర వీడియోను నూతన సంవత్సరం సందర్భంగా రాహుల్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి తోటలోని బత్తాయిలను తెంపుకొచ్చి జామ్ తయారు చేస్తూ తమ ఆహార ఇష్టాయిష్టాలను సరదాగా పంచుకున్నారు. కావాలంటే బీజేపీ వాళ్లకు కూడా జామ్ ఇద్దామని రాహుల్ అంటే, ‘మనకే తిరిగిచ్చేస్తా’రని సోనియా బదులిచ్చారు. జామ్ రెసిపీ తన చెల్లెలు ప్రియాంకదని రాహుల్ వెల్లడించారు. తల్లికి ఒకప్పుడు పచ్చళ్లు నచ్చేవి కావని, ఇప్పుడవి ఎంతో ఇష్టమని రాహుల్ అన్నారు. బ్రిటన్‌లో ఉండగా వంట నేర్చుకున్నానన్నారు. తానెప్పుడు విదేశాల నుంచి తిరిగొచ్చినా ముందుగా పప్పన్నం తినాల్సిందేనని సోనియా చెప్పారు. మాటల మధ్యే తయారైన జామ్‌ను ఇద్దరూ కలిసి చిన్న గాజు సీసాల్లో నింపారు. ‘ప్రేమతో.. సోనియా, రాహుల్’ అని రాసి స్నేహితులు, బంధువులకు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. మరోసారి టీడీపీ పెద్దలకు పేదలే లక్ష్యం..
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు దక్కకుండా చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి విఫలమైన తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇప్పుడు మరోసారి ఆ పేదలను లక్ష్యంగా చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు పేదలు సిద్ధమవుతున్న తరుణంలో.. అడ్డుకునేందుకు మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ తమకు అనుకూలురైన వారిచేత పిటిషన్ వేయించారు. ఇందులో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగత హోదా లో ప్రతివాదిగా చేర్పించి, ఆయనపై పలు నిందారోపణలు చేయించారు. ఈ పిటిషన్‌పై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకటజ్యోతిర్మయి ధర్మాసనం విచారించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మినహా మిగిలిన ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీఆర్డీఏ కమిషనర్, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, భూ కేటాయింపు కమిటీ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు భారీ షాక్... అలాగే రాజధాని ప్రాంతంలో పేదల కోసం ఏర్పాటు చేసిన ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందా? లేక ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతినిచ్చిందా? పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా అనుమతినిచ్చిందా? అన్న విషయంలో స్పష్టతనివ్వాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. అప్పుడు అలా.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఆర్డీఏ చట్ట నిబంధనలు చెబుతున్నా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో చట్ట నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో 1,402 ఎకరాల్లో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ఏకంగా ఆర్ 5 జోన్‌ను సృష్టించింది. పేదల కోసం ఆ భూములను సీఆర్డీఏ నుంచి కొనుగోలు చేసింది. ఈ భూముల్లో 50,793 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. తమ ప్రాంతంలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో వారికి పట్టాలు రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు సర్వశక్తులు ఒడ్డారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దించారు. అయినా కూడా టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. పేదలకు ఇళ్లస్థలాల మంజూరు అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నొక్కి చెప్పడంతో పట్టాల మంజూరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం విజయవంతంగా పేదలకు పట్టాలు పంపిణీ చేసింది. పేదలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు కేంద్రం అనుమతులు సైతం మంజూరు చేసింది. దీంతో ఖంగుతున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు పేదల స్థలాల్లో చేపట్టబోతున్న ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఇలా.. ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సవాలు చేసిన విధంగానే ఆర్ 5 జోన్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని, 1,402 ఎకరాల బదలాయింపు జీవోలను కూడా తాజా పిటిషన్లోను సవాలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
ఎమ్మెల్సీ పదవి కోసం యత్నాలు
∙ అనుచరులతో గన్ని కృష్ణ మంతనాలు ∙ గతంలో తాను చేసిన త్యాగాలు ఏకరువు ∙ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం సాక్షి, రాజమహేంద్రవరం : స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరగనున్న ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో టీడీపీలో సిగపట్లు మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పదవిని ఆశిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ముందుగానే రంగంలోకి దూకారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఎమ్మెల్సీ టిక్కెట్టు తనకు వచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే యత్నాలకు శ్రీకారం చుట్టారు. 30 ఏళ్లకు పైగా పార్టీలో క్రమశిక్షణ గల నేతగా తనకు పేరుందని ఈ సందర్భంగా అనుచరులకు చెప్పారు. ప్రతిసారీ సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం తాను త్యాగాలు చేస్తున్నానని గుర్తు చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినా.. అధిష్టానం ఆదేశాల మేరకు విజయం కోసం శ్రమించానని చెప్పారు. ఎమ్మెల్యే సీటు వదులుకోవాలని, పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ హామీని అమలు చేసేలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెవాలన్న తలంపుతోనే గన్ని కృష్ణ తన అనుచరులతో ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. -
విద్యార్థుల అభివృద్ధికి కృషి
ఏపీ ప్రైవేట్ స్కూల్ల అసోసియేషన్ అధ్యక్షుడు సుందరరావు నరసరావుపేట రూరల్ : విద్యార్థుల మానసిక, సామాజిక అభివృద్ధికి ప్రైవేటు పాఠశాలలు తమ వంతు కృషిచేస్తున్నాయని ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అ««దl్యక్షుడు వి.సుందరరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలను కేవలం చదువు చెప్పే కర్మగారాలుగా భావించవద్దని కోరారు. కోటప్పకొండలోని లివింగ్ హోప్ పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రైవేటు పాఠశాలల ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. లివింగ్ హోప్ పాఠశాల డైరక్టర్ బి.సుశీల్‌కుమార్ అ««దl్యక్షతన జరిగిన పోటీల ప్రారంభ కార్యక్రమంలో సుందరరావు మాట్లాడారు. క్రీడాస్ఫూర్తితో ఉన్నత లక్ష్యాల వైపు దూసుకుపోవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ కృష్ణా జిల్లా అద్యక్షుడు మోహనరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడల వైపు ఆసక్తి చూపకపోతే జీవితంలో సమస్యలను ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అసోసియేషన్ జిల్లా అ««దl్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి శ్రీహారి, కోశాధికారి మల్లిఖార్జునరావు, ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల రాము, ప్రిన్సిపాల్ సంఘమిత్ర, స్పోర్ట్స్ కన్వీనర్ ఎస్ఎమ్ సుభాని తదితరులున్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
నడిగూడెం: కోదాడ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావులు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లోని రహదారుల అభివద్ధికి రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపినట్లు ,అలాగే రూ.40 కోట్లతో రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల్లో జలకళ కన్పిస్తుందన్నారు.ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, పాలడుగు ప్రసాద్, తదితరులున్నారు. -
కాలువను పూడ్చి వేసేందుకు చర్యలు
చిలుకూరు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఉదృతికి తెగిన కాలువకు వెంటనే మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, పీఆర్‌జేఈ భాస్కర్‌రావులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని అక్షర కళాశాలకు సమీపాన హుజూర్నగర్ రోడ్డు వెంట తెగిన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ తెగడం వల్ల నారాయణపురం గ్రామస్తులకు, కళాశాల విద్యార్థులకు రాకపోకలు బంద్ అయినాయని తక్షణమే మరమ్మతులు చేయించి కాలువను పూడ్చి వేస్తామని వారన్నారు. -
చివరి భూములకు నీరందించేందుకు కృషి
నడిగూడెం: సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజరు కాల్వ పరిధిలో చివరి భూములకు నీరందించేందుకు కషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ నియోజవకర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ తూమును పరిశీలించిన అనంతరం రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత ఎన్ఎస్పీ అధికారులతో నీటి డిశ్చార్జిని పెంచాలని, కోదాడ మండలంలోని చివరి గ్రామాల వరకు నీరందాలని ఫోన్లో కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, చిలుకూరు ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, నాయకులు కాసాని వెంకన్న, దున్నా ప్రవీణ్, గుండు విజయరామారావు, గడ్డం మల్లేష్, భూక్యా నారాయణనాయక్, బడుగుల వెంకటేశ్వర్లు, నాగార్జున్, రైతులు, తదితరులున్నారు. -
చివరి భూములకు నీరందించేందుకు కృషి
నడిగూడెం: సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజరు కాల్వ పరిధిలో చివరి భూములకు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు టీఆర్ఎస్ నియోజవకర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ తూమును పరిశీలించిన అనంతరం రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత ఎన్ఎస్పీ అధికారులతో నీటి డిశ్చార్జిని పెంచాలని, కోదాడ మండలంలోని చివరి గ్రామాల వరకు నీరందాలని ఫోన్లో కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, చిలుకూరు ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, నాయకులు కాసాని వెంకన్న, దున్నా ప్రవీణ్, గుండు విజయరామారావు, గడ్డం మల్లేష్, భూక్యా నారాయణనాయక్, బడుగుల వెంకటేశ్వర్లు, నాగార్జున్, రైతులు, తదితరులున్నారు. -
నేనెళ్లి పోతా
బదిలీ కోసం కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రయత్నాలు నెలాఖరులో బదిలీ అవకాశం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కమిషనర్ కె.వెంకటేశ్వర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి సొంత జిల్లా కావడం, అధికార పార్టీలోని వర్గ రాజకీయాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా తనను విజయవాడ, గుంటూరు కు కానీ, మున్సిపల్ పరిపాలనా విభాగానికి కానీ బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి చక్రధర్‌బాబును కార్పొరేషన్ కమిషర్‌గా తెచ్చారు. పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనుల విషయంలో తనను ఏ మాత్రం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయనతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్పొరేటర్లు కూడా చక్రధర్‌బాబును వ్యతిరేకించడంతో ఆయన్ను సాగనంపారు. ఆ తర్వాత పీవీవీ ఎస్ మూర్తిని కమిషనర్‌గా తెచ్చారు. కార్పొరేషన్‌కు ఉన్న బకాయిలు చెల్లించే వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేయర్ వ్యతిరేకించారు. పరిపాలనా వ్యవహారాల విషయంలో ముక్కు సూటిగా వెళ్లడంతో మేయర్ మంత్రి నారాయణ మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ను కూడా బదిలీ చేయించారు. గుంటూరులో రీజనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె.వెంకటేశ్వర్లును ఆర్నెల్ల కిందట కిందట కమిషనర్‌గా తెచ్చారు. రెండు నెలల కిందట జరిగిన ఏసీబీ దాడులు కమిషనర్‌కు చిక్కులు తెచ్చి పెట్టాయి. మంత్రి నారాయణ ఆయన మీద అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో మంత్రితో మేయర్‌కు, మేయర్‌తో ఆనం వివేకానందరెడ్డికి ఉన్న విభేదాలు కూడా పరిపాలనా వ్యవహారాల్లో ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒకరు ఉత్తరం అంటే ఇంకొకరు దక్షిణం అనే పరిస్థితి ఉంది. ఎవరు చెప్పింది చేయాలో అర్థం కాక కమిషనర్ ఇబ్బంది పడుతున్నారు. ఈ వాతావరణంలో తాను పనిచేయలేననీ ఇంకో చోటికి బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ నెలాఖరులో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు ఉంటాయనీ, ఈ జాబితాలో వెంకటేశర్లు బదిలీ అవుతారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
నల్లగొండ క్రైం : గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన పట్ణ శివారులోని చర్లపల్లిలో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించారు. మిషన్ ఓపెన్ కాకపోవడంతో అందులోని వైర్లను తగులబెట్టి వెళ్లిపోయారు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో టూటౌన్ సీఐ రవీందర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
పసికందును ఎత్తుకుపోయి దొరికిపోయిన మహిళ
-
అప్పీలుకు బామ్మగారి 'అల్లికల' పాట్లు!
మరణ శిక్షనుంచి బయట పడేందుకు ఓ బామ్మగారు పడరాని పాట్లు పడుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తూ తన నైపుణ్యంతో శిక్షను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. హాబీగా ఉన్న అల్లికలను అమ్మకానికి పెట్టి, తోటి ఖైదీలకు నేర్పుతూ శిక్ష నుంచి బయటపడేందుకు ఆ బ్రిటిష్ బామ్మ తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ఫేస్ బుక్, ట్విట్లర్ వంటి సామాజిక మాధ్యమాలను కూడ వినియోగించుకుంటోంది. ఇండోనేషియాలోని బాలీకి కొకైన్ అక్రమ రవాణాకు పాల్పడిందన్న కేసులో 2013 లో చెల్తెన్ హామ్ కి చెందిన 59 ఏళ్ళ లిండ్సీ శాండిఫోర్డ్ కు మరణ శిక్ష విధించారు. అయితే ఆ బామ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తోందని, అది తగ్గించేందుకు అంతా సహకరించాలంటూ ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలోనూ ఆమె పరిస్థితిని వివరిస్తూ ప్రచారం జోరందుకుంది. లిండ్సీ శిక్షను తగ్గించుకోవాలంటే అప్పీల్ చేసుకునేందుకు వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది. అందుకు తనకు చేతనైన స్వెట్టర్లు, షాల్స్, బొమ్మలు మొదలైన వివిధ రకాల ఊలు అల్లికలను అమ్మకానికి పెట్టింది. జైల్లోని మరో ఇరవైమంది మహిళలకు అల్లికలు కుట్లు నేర్పుతూ.. షాల్స్, స్వెట్టర్లు, ఉలెన్ టెడ్డీబేర్లు వంటి వాటిని ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా ఆస్ట్రేలియాలోని చర్చి గ్రూపులకు అమ్మకాలు నిర్వహిస్తోంది. వచ్చిన డబ్బుతో అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటిదాకా జరిపిన అమ్మకాలతో ఏడువేల యూరోలు సంపాదించింది. తాను శిక్ష నుంచి బయట పడాలంటే న్యాయవాదులకు మరో 15 వేల యూరోలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఆ ఫీజు చెల్లించలేకపోతే ఆమెకు ఈ సంవత్సరంలో మరణశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇండోనేషియా ప్రస్తుతం ఆమె మరణదండన పై తాత్కాలిక విరామాన్ని ఇచ్చింది. బామ్మగారి పరిస్థిపై ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బ్రిటిష్ యాంటిక్ డీలర్ జూలియన్ పాండర్ ఆమెతో బలవంతంగా ఈ నేరం చేయించాడని బ్రిటన్ ఇప్పటికే చెప్పిందని.. కెరోబోకన్ జైల్లో ఉన్న శాండిఫోర్డ్ చెప్తోంది. అల్లికలు అంటే తనకు పిచ్చి అని, ఖాళీ సమయాల్లో అల్లికలతోనే కాలం గడిపే తనను... తన నైపుణ్యమే శిక్షనుంచి రక్షిస్తుందని శాండిఫోర్డ్ నమ్ముతోంది. అయితే తన అవసరం కోసం కాక జైల్లోని ఇతర మహిళలు సైతం అల్లికలు నేర్చుకోవడం వల్ల.. నైపుణ్యం పెరగడమే కాక, సంపాదించిన డబ్బుతో జైలునుంచి బయట పడగల్గుతారని ఆమె చెబుతోంది. -
పరభాషలో టాలీవుడ్ హీరోల జోరు