
చివరి భూములకు నీరందించేందుకు కృషి
నడిగూడెం: సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజరు కాల్వ పరిధిలో చివరి భూములకు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ నియోజవకర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ తూమును పరిశీలించిన అనంతరం రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత ఎన్‌ఎస్పీ అధికారులతో నీటి డిశ్చార్జిని పెంచాలని, కోదాడ మండలంలోని చివరి గ్రామాల వరకు నీరందాలని ఫోన్‌లో కోరారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్, చిలుకూరు ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, నాయకులు కాసాని వెంకన్న, దున్నా ప్రవీణ్, గుండు విజయరామారావు, గడ్డం మల్లేష్, భూక్యా నారాయణనాయక్, బడుగుల వెంకటేశ్వర్లు, నాగార్జున్, రైతులు, తదితరులున్నారు.