
కాలువను పూడ్చి వేసేందుకు చర్యలు
చిలుకూరు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఉదృతికి తెగిన కాలువకు వెంటనే మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, పీఆర్‌జేఈ భాస్కర్‌రావులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని అక్షర కళాశాలకు సమీపాన హుజూర్‌నగర్ రోడ్డు వెంట తెగిన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ తెగడం వల్ల నారాయణపురం గ్రామస్తులకు, కళాశాల విద్యార్థులకు రాకపోకలు బంద్ అయినాయని తక్షణమే మరమ్మతులు చేయించి కాలువను పూడ్చి వేస్తామని వారన్నారు.