Published
Fri, Jul 22 2016 5:19 PM
| Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
దళిత వాడలను అభివృద్ది చేయాలి : మట్టిపల్లి
సూర్యాపేటరూరల్ : దళిత వాడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్రకమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. శుక్రవారం రాయినిగూడెం, కేసారం, కాసరబాద, ఇమాంపేట, దాసాయిగూడెం గ్రామాల్లో చేపట్టిన దళితుల ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో ఆయన మాట్లాడారు. చాలా వరకు గ్రామాల్లో దళితులు చనిపోతే బొంద పెట్టడానికి శ్మశానస్థలం లేక నేటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నల్లమేకల అంజయ్య, నాయకులు రణపంగ జయబాబు, చింత భిక్షం, కామళ్ల లింగయ్య, బొస్క సోమయ్య, దైద దానేలు, పాముల కృష్ణ, పాముల ఉపేందర్, నకిరేకంటి రాములు, మామిడి సైదులు, బోయిళ్ల వెంకటయ్య, బండారు వెంకటయ్య, గోపి, తదితరులు పాల్గొన్నారు.