
సీపీఐ బలోపేతానికి కృషి చేయాలి
చిలుకూరు: గ్రామాల్లో సీపీఐ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని బేతవోలు గ్రామంలో జరగిన పార్టీ నిర్మాణ మహసభలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు సమన్వంతో పని చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ చేసే నిర్ణయాలు కింది స్థాయిలో కార్యకర్తలకు చేరాలని నాయకులకు సూచించారు. ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగే తెలంగాణ విముక్తి వారోత్సవాల్లో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 11న రాత్రి చిలుకూరుకు తెలంగాణ బస్సు యాత్ర చేరుకుంటుందని అన్నారు. కార్యక్రమంకు ముందు పల్లా వెంకట్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కొండా కోటయ్య, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను, నంధ్యాల రామిరెడ్డి, పుట్టపాక శ్రీనివాస్, చేపూరి కొండల్, సర్పంచ్‌లు సుల్తాన్ వెంకటేశ్వర్లు, తాళ్లూరి పద్మా శ్రీనివాస్, రెమిడాల రాజు జయసుధ, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల శ్రీను, మండల , గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.