మాట్లాడుతున్న ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు
విద్యారంగ పరిరక్షణకు కృషి
Published Thu, Aug 25 2016 11:19 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
– ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు
ఆమనగల్లు: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్‌టీయూ నిరంతరం కృషి చేస్తుందని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో గురువారం నిర్వహించిన ఎస్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కారు చర్యలు తీసుకోవాలని, భవనాలు నిర్మించడమే కాకుండా మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉన్న పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినేలా విద్యాశాఖ మంత్రి కడియం చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. నవంబర్‌లో ఎస్‌టీయూ 70 ఏళ్ల వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి, నాయకులు సదానందం గౌడ్, రవి,శివప్రసాద్,కిష్టారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సమద్, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్, సత్యనారాయణ, యూనిస్, పాషా, పర్వత్‌రెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.
Advertisement