16న జిల్లాస్థాయి విద్యా సదస్సు | district level education meet on 16th | Sakshi
Sakshi News home page

16న జిల్లాస్థాయి విద్యా సదస్సు

Published Fri, Jan 13 2017 11:31 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

district level education meet on 16th

కర్నూలు సిటీ: ఎస్టీయూ ఏర్పడి 70 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల16న  జిల్లా స్థాయి విద్యాసదస్సు ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎస్‌ ప్రసాద్‌రెడ్డి, తిమ్మన్న  తెలిపారు. శుక్రవారం స్థానిక సలాంఖాన్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశ«ంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ విద్య– పరిరక్షణ అనే అంశంపై  16వ తేది ఉదయం 10 గంటలకు జెడ్పీ ఆవరణలోని మండల పరిషత్‌ కార్యాలయంలో సదస్సు నిర్వహించనున్నామన్నారు.  మొదట కలెక్టరేట్‌ నుంచి జెడ్పీ వరకు మహార్యాలీ జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు  సన్మూర్తి, జోసెఫ్‌ సుధీర్‌బాబు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్‌–1938, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.  సమావేశంలో ఎస్టీయూ నాయకులు సుధాకర్‌గౌడు, వెంకట్రాముడు, రహీం, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement