విద్యాస్థితి గతులపై సమగ్ర సర్వే
Published Sun, Sep 25 2016 10:42 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
అయ్యలూరు(నంద్యాలరూరల్): జిల్లాలో విద్యా ప్రమాణాలను తెలుసుకునేందుకు ఈనెల 25 నుంచి రెండు రోజుల పాటు అసర్–2016 సర్వే చేస్తున్నట్లు బెంగళూరుకు చెందిన ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ గోవిందరాజు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని అయ్యలూరు్ర గామంలో కర్నూలు డైట్ కళాశాల విద్యార్థులు శ్రావణి, పవిత్రలు వార్షిక విద్యాస్థితి నివేదిక సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏక కాలంలో ఈ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక విద్యాస్థాయిని అంచనా వేసేందుకు మూడేళ్ల నుంచి 16సంవత్సరాలలోపు చిన్నారులు పాఠశాలలకు వెళ్తున్నారా.. లేదా? చదవగలరా.. గణితం చేయగలరా.. ఇంగ్లిష్ పదాలు నేర్చుకున్నారా? తదితర ప్రశ్నలతో ఈ సర్వే చేస్తున్నామన్నారు.
Advertisement