ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని, తద్వారా మేధాశక్తిని సంపాదించవచ్చని మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ విద్యార్థులకు సూచించారు.
ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
Published Sun, Aug 14 2016 12:03 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM
రాప్తాడు: ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని, తద్వారా మేధాశక్తిని సంపాదించవచ్చని మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌వీఐటీ)లో కళాశాల డైరెక్టర్ చక్రధర్‌రెడ్డి అధ్యక్షతన ఫైనల్ ఇయర్ ఈసీఈ, ఈఈఈ చదువుతున్న విద్యార్థులకు రెండు రోజుల పాటు మ్యాట్ ల్యాబ్‌పై వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ హజరై మ్యాట్ ల్యాబ్‌లోని పరికరాలు ఎలా పనిచేస్తాయి.. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటి ద్వారా ఎలా టెక్నాలజీని అభివృద్ధి చే యాలనే అంశాలపై విద్యార్థులకు ప్ర యోగాల ద్వారా అవగాహన కల్పిం చారు. అలాగే మ్యాట్ ల్యాబ్‌పై విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు నూతన ప్రయోగాలు చేస్తూ సరికొత్త ఒరవడికి నాందీ పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సి.చక్రధర్‌రెడి, కళాశాల ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి, ఏఓ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, హెచ్‌ఓడీ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement