Enaphilis females
-
Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి
మలేరియావ్యాధి నిర్మూలనలో పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు ముందు కేశారు. జెఎన్‌యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన, టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించింది.మనిషిలోఇన్ఫెక్షన్కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేయగలదన్నారు.మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ ఇవి అని చెప్పారు. పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని ఇరువురు ప్రొఫెసర్లు పునరుద్ఘాటించారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి. ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు. -
దోమలతో జర జాగ్రత్త గురూ!
న్యూఢిల్లీ: ప్రణాళికలు లేని నిర్మాణ పనులు, పరిశ్రమలు, వలసల పెరుగుదల భారతదేశ పట్టణాల్లో మలేరియా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళికలు లేకుండా భవనాలు కట్టడం, పరిశ్రమలను స్థాపించడంవల్ల... దోమల పునరుత్పత్తికి దోహదం చేస్తోందని, అందుకే పట్టణ ప్రాంతాల్లో మలేరియా బాధితులు అధికంగా ఉంటున్నారని మలేరియా వ్యాధుల విభాగం అధినేత జీఎస్ సోనాల్ తెలిపారు. భవననిర్మాణం చేసేవాళ్లు, పారిశ్రామిక వేత్తలు చెత్తను సరైన పద్ధతిలో పారవేసినప్పుడే దోమల పునరుత్పత్తి నివారణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అందుకోసం కొత్త నిర్మాణాలు చేపట్టేటప్పుడు, పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యశాఖను సంప్రదించాలని ఆయన సూచించారు. మురికి లేదా నిల్వ ఉన్న నీటిలోని ఆడ ఎనాఫిలిస్ దోమ కాటువల్ల మలేరియా వస్తుందని, 2010లో భారత్‌లో 45వేల మలేరియా మరణాలు నమోదయ్యాయని సోనాల్ తెలిపారు. దేశం మొత్తంలో మలేరియా మృతుల సంఖ్య తగ్గిపోతుంటే.. పట్టణాల్లో మాత్రం మలేరియా కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దోమతెరలు ఉపయోగించడం, నిల్వ నీటిని తొలగించడం, చెత్త నిల్వ ఉండకుండా చేయడం వల్ల భారతదేశంలో మలేరియా కారణంగా సంభవిస్తున్న వేల మరణాలను తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గాలిలోని వాహకాల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల సంఖ్య వేసవిలో పెరుగుతుందని, దోమలను బట్టి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. మూతలు లేని పాత్రల్లో నీరు నిల్వచేయొద్దని, కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పోయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, నీరు నిల్వ ఉండి ఎటూ వెళ్లడానికి మార్గంలేకపోతే.. ఆ నిల్వ నీటిపై కిరోసిన్ చల్లడంవల్ల దోమలను నివారించొచ్చని ైవె ద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవేవి సాధ్యంకాని సమయంలో కీటక సంహారక మందులను, దోమ తెరలను వాడాలని సూచిస్తున్నారు. దోమల నుంచి పి-వైవాక్స్, పి-ఫాల్సిపారం, పి-ఓవేల్, పి-మలేరియే అనే నాలుగు రకాల మలేరియాలు మనుషులకు వ్యాపిస్తాయని, వాటిలో మొదటి రెండు భారత ఉపఖండంలో ఎక్కువగా ఉండగా... చివరి రెండు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. వైవాక్స్ క్లోరోక్వినైన్తో వెంటనే తగ్గిపోగా... ఫాల్సిపారం అనేక సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. సరైన సమయంలో చికిత్సనందించకపోతే ఈ జ్వరం మెదడు, కిడ్నీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.