కోడిగుడ్లు
న్యూయార్క్, అమెరికా : అమెరికా దేశ ప్రజలను సల్మొనెల్లా బ్యాక్టీరియా వణికిస్తోంది. కోడిగుడ్ల ద్వారా సల్మొనెల్లా వ్యాధి ప్రజలకు సోకుతుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా అమెరికాలోని సెమార్ రోజ్ ఎకర్స్ ఫార్మ్స్ దాదాపు 20 కోట్ల గుడ్లను వెనక్కు తీసుకుంది.
ఇప్పటివరకూ 22 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. హైడె కౌంటీ, న్యూయార్క్, కొలరాడో, ఫ్లారిడా, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, సౌత్ కరోలినాయ, వర్జీనియా, పశ్చిమ వర్జీనియాల్లో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఉన్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ పేర్కొంది.
2010 తర్వాత అమెరికాలో ఇంత భారీ మొత్తంలో కోడిగుడ్లను వెనక్కు తీసుకోవడం ఇదే తొలిసారి.
ఏంటి సల్మొనెల్లా?
కోడిగుడ్లలో నిల్వ ఉండే బ్యాక్టీరియా వల్ల జ్వరం, విరేచనాలు, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి కలుగుతుంది. ఈ స్థితి ఎక్కువ సేపు కొనసాగడం వల్ల మరణం కూడా సంభవించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment