హెల్త్ క్విజ్
1. మన టూత్‌బ్రష్ బ్రిజిల్స్ ఎలా ఉండాలి?
2. బ్రష్ చేసుకోవడంలో సరైన ప్రక్రియ అంటే ఎలా ఉండాలి?
3. పళ్లకు మధ్య బ్రష్ చేరుకోని ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఏం చేయాలి?
4. బ్రషింగ్ ప్రక్రియ ఎంత సేపు చేయాలి?
5. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకోసం బ్రషింగ్‌తో పాటు చేయాల్సిందేమిటి?
6. ఎన్నాళ్లకు ఒకసారి బ్రష్ మార్చాలి?
జవాబులు:
1. దంతాలను, చిగుళ్లను గాయపరచనంత మృదువుగా ఉండాలి.
2. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోవాలి.
3. ఫ్లాసింగ్ (దారంలాంటిదానితో శుభ్రం చేయడం) ప్రక్రియ ద్వారా వ్యర్థాలను తొలగించాలి.
4. మూడు నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చేయాలి. అదేపనిగా బ్రష్ నములుతూ బ్రష్ చేయకూడదు.
5. నాలుకపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడం కోసం టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి.
6. {పతి మూడు నెలలకోమారు బ్రష్ మార్చాలి.