వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. ఈ మాటలు చాలాసార్లు మనం వినే ఉంటాం. అయితే నీటిని శుద్ధి చేసేందుకు బ్యాక్టీరియాలను ఉపయోగించవచ్చునన్న ఆలోచన మాత్రం వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసి చూపారు. బ్యాక్టీరియా కారణంగా నీరు కలుషితమవుతుందిగానీ.. శుద్ధి ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ అంటున్నారు సింగమనేని శ్రీకాంత్. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరైన ఈయన తన విద్యార్థులతో కలిసి బ్యాక్టీరియాతో నిర్మితమైన ఓ ఫిల్టర్‌ను తయారు చేశారు. ఈ ఫిల్టర్‌లో గ్రాఫీన్ ఆౖMð్సడ్, బ్యాక్టీరియల్ నానో సెల్యులోజ్ ఉంటాయి.
నీటి శుద్ధీకరణకు వాడే సాధారణ ఫిల్టర్లలో బ్యాక్టీరియా చేరడం వల్ల కొద్దోగొప్పో దుర్వాసన వేస్తూంటాయన్నది మనకు అనుభవమైన విషయం. కానీ కొత్త ఫిల్టర్‌లో మాత్రం ఈ సమస్య ఉండదు. శ్రీకాంత్ గతంలోనూ ఇలాంటి ఫిల్టర్లను బంగారు నానోకణాల సాయంతో చేసినప్పటికీ చౌకైన ప్రత్యామ్నాయం కోసం జరిగిన ప్రయత్నాల్లో గ్రాఫీన్ ఆక్సైడ్, బ్యాక్టీరియా ఫిల్టర్ సిద్ధమైంది. గ్రాఫీన్ ఆక్సైడ్ కారణంగా ఫిల్టర్ సూర్యరశ్మితో వేడెక్కుతుందని, అది చుట్టూ ఉన్న నీటిలోకి ప్రవేశించడం ద్వారా నీటిలోని ఇతర బ్యాక్టీరియాను శుద్ధి చేస్తుందని శ్రీకాంత్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment