
న్యూఢిల్లీ: ప్రజలకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యక్తులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపును ఇస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో వ్యవసాయ కూలీలు, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లను నడిపించే మార్కెట్ కమిటీ, ప్యాకేజింగ్ యూనిట్లు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు పొందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మార్కెట్ కమిటీలు నిర్వహించే మండీలు, కనీస మద్దతు ధరకు సంబంధించిన వ్యవహారాలు నిర్వర్తించే విభాగాలు కూడా దీని నుంచి మినహాయింపు పొందాయి. వీరితోపాటు వ్యవసాయ సంబంధిత పనుల్లో పాల్గొనే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలకు కూడా మినహాయింపు లభించింది. వ్యవసాయ సంబంధిత యంత్రాలు, వాటి తయారీ, ఎరువులు పురుగు మందుల తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు పొందాయి. అత్యవసర సరుకులు, మందులను రవాణా చేసే ఈ కామర్స్ సంస్థలకు కూడా మినహాయింపు ఉంది