![మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33%](/styles/webp/s3/article_images/2017/09/3/81460586196_625x300.jpg.webp?itok=RxclZSeb)
మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33%
♦ మహిళా రిజర్వేషన్లు
♦ ఖరారు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ల నియామకంలో మహిళా కోటా కింద 33 శాతం స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా మహిళలకు కూడా కోటా కేటాయించింది. ఈ మేరకు జిల్లాలవారీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని లాటరీ విధానంలో జిల్లాలవారీగా బుధవారం రిజ ర్వేషన్లు ఖరారు చేసింది.
రాష్ట్రంలోని మొత్తం 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూల్డ్ ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించింది. అవి పోను మిగతా 168 కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 29 శాతం చైర్‌పర్సన్ పదవులు కేటాయిం చింది. మిగతా 84 కమిటీలను ఓసీగా ప్రకటించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు మహిళలకు దక్కాయి.