Chairman positions
-
మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33%
♦ మహిళా రిజర్వేషన్లు ♦ ఖరారు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ల నియామకంలో మహిళా కోటా కింద 33 శాతం స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల నియామకంలో తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా మహిళలకు కూడా కోటా కేటాయించింది. ఈ మేరకు జిల్లాలవారీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న మార్కెట్ యార్డులను కూడా పరిగణనలోకి తీసుకుని లాటరీ విధానంలో జిల్లాలవారీగా బుధవారం రిజ ర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూల్డ్ ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించింది. అవి పోను మిగతా 168 కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 29 శాతం చైర్పర్సన్ పదవులు కేటాయిం చింది. మిగతా 84 కమిటీలను ఓసీగా ప్రకటించింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 13 మార్కెట్ కమిటీలు మహిళలకు దక్కాయి. -
మెజారిటీ పదవులే లక్ష్యం!
స్థానికంగా టీఆర్ఎస్ పాచికలు - ఇతర పార్టీల్లోని సభ్యులపై వల - జోరుగా ప్రలోభాల పర్వం - నేడు మంత్రి హరీష్‌రావు రాక - రెండు రోజుల పాటు జిల్లాలోనే మకాం - అజ్ఞాతంలోకి కాంగ్రెస్, టీడీపీ సభ్యులు - విప్‌తో ఎదుర్కొనేందుకు సన్నద్ధం సంగారెడ్డి డివిజన్: స్థానిక సంస్థల పదవులే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీ, ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. మెజార్టీలేని చోట సైతం చైర్మన్ , అధ్యక్ష పదవులను కైవసం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. కాగా మంత్రి హరీష్‌రావు మంగళవారం జిల్లాకు రానున్నారు. అవసరమైన వ్యూహరచన చేసేందుకు రెండు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అలాగే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు విప్‌ను అస్త్రంగా మలుచుకునే ప్రయత్నాల్లో విపక్షాలు నిమగ్నమయ్యాయి. కాగా జూలై 3, 4, 5 తేదీల్లో వరుసగా మున్సిపల్, మండలపరిషత్ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. మున్సిపాలిటీల్లో పాగా! గులాబీ పార్టీ ఎలాగైనా జిల్లాలోని అధిక మున్సిపాలిటీల్లో పాగా వేయాలని చూస్తోంది. మెదక్ మున్సిపాలిటీ మినహా జిల్లాలో ఎక్కడా టీఆర్ఎస్కు చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు అవసరమైన బలం లేదు. అయితే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి చెందిన కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుని పదవులను కైవసం చేసుకోవాలని చూస్తోంది. సంగారెడ్డిలో ఎంఐఎం మద్దతు తీసుకోవటంతోపాటు కాంగ్రెస్ నుంచి నలుగురు కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సదాశివపేటలో సైతం కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్లను తమైవె పు తిప్పుకునేందుకు ప్రలోభాలను తెరలేపింది. జహీరాబాద్‌లో టీడీపీ, బీజేపీ, ఎంఐఎంతో జతకట్టి చైర్మన్ పదవి దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందోలులో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఇద్దరు నాయకులు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. దీంతో పార్టీలో విభేదాలు నెలకొన్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అసంతృప్త కౌన్సిలర్లను తమవైపు మరల్చుకుని చైర్మన్ పదవి దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. గజ్వేల్‌లో కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరటంతో ఇక్కడ ఆ పార్టీకి చైర్మన్ పదకి దక్కే అవకాశం సులువైంది. ఎంపీపీ పదవులపైనా కన్ను మెజార్టీ ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పటాన్చెరులో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే గెలుపొందారు. అయితే ఇక్కడ ఇతర పార్టీలలోని ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. పెద్దశంకరంపేట మండలంలో ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుని ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. న్యాల్కల్ మండలంలో సైతం పదవి కోసం టీఆర్ఎస్ నాయకత్వం టీడీపీతో జతకట్టేందుకు సిద్ధమవుతోంది. కల్హేర్ మండలంలో ఎంపీపీ పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ మిలాఖత్ అవుతున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నియోజవకర్గంలోని ఆరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం.. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ సీఎం కావటంతో ఆరు మండలాల్లోని కాంగ్రెస్, టీడీపీ ఎంపీటీసీలు చాలామంది టీఆర్ఎస్లో చేరారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గంలోని సొంత బలం లేనప్పటికీ అన్ని మండలాల్లో టీఆర్ఎస్ ఎంపీపీ పదవులను దక్కించుకోనుంది. రేగోడ్, నర్సాపూర్, సంగారెడ్డి, సదాశివపేటతోపాటు తమకు బలంలేని పలు మండలాల్లో ఎంపీపీ పదవులు కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. కాగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అధికార పార్టీ వ్యూహాలను తిప్పికొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. విప్‌ను అస్త్రంగా మార్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కాగా ఆదివారం హైదరాబాద్‌లో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో జరిగిన భేటీలో జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు విప్జారీపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి లేదా గీతారెడ్డికి విప్ జారీ చేసే అధికారం ఇచ్చే అవకాశాలున్నాయి. విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్ జెడ్పీటీసీలతోపాటు ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఎవరైనా అధికార పార్టీకి మద్దతిస్తే వారిపై వేటుపడేలా చూడాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. -
క్యాంపుల భారం తడిసిమోపెడు
చైర్మన్ పదవులకు రేసులో ఉన్న ఆశావహులు ఫలితాలు వెలువడిన వెంటనే మద్దతు దారులను కూడదీసుకుని వెళ్లారు. క్యాంపులు సుదీర్ఘంగా నిర్వహిం చాల్సి రావడంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. అయి నాసరే ఫలితం ఉంటుందనే ధీమాతో చైర్మన్ అభ్యర్థుల్లో కనిపించడం లేదు. ఫలితాలు వెలువడగానే రామగుండం కార్పొరేటర్లను టీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరుగా క్యాంపులకు తరలించాయి. గత నెల 14 నుంచి క్యాంపు నిర్వహించిన ఈ రెండు పార్టీలు మేయర్ ఎన్నికపై స్పష్టత లేకపోవడంతో ఈ నెల 20న ఇంటికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆరుగురు స్వతంత్రులతో పాటు తమ 19 మంది కార్పొరేటర్లతో క్యాంపు వేయగా, టీఆర్ఎస్ తొమ్మిది మంది స్వతంత్రులతో కలిపి తమ 14 మంది కార్పొరేటర్లతో క్యాంపు నిర్వహించింది. విశాఖపట్నం, తిరుపతి, ఊటీ తదితర ప్రాంతాలకు వెళ్లడంతో రెండు పార్టీలకు భాగానే ఖర్చయింది. రోజుకు కనీసం రూ.20 నుంచి రూ.30 వేలు ఖర్చు కావడంతో ఒక్కో పార్టీకి ఇప్పటికే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో నోటిఫికేషన్ వచ్చాక మళ్లీ క్యాంపునకు వెళ్లొచ్చని తిరిగి వచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ముగ్గురు స్వతంత్రులతో టీఆర్ఎస్ క్యాంప్‌ను నిర్వహించింది. నోటిఫికేషన్ రాకపోవడంతో పదిరోజుల క్రితం వారంతా తిరిగి వచ్చారు. నోటిఫికేషన్ వచ్చాక క్యాంపుపై ఆలోచన చేయనున్నారు. - హుస్నాబాద్ నగరపంచాయతీని దక్కించుకొనేందుకు టీఆర్ఎస్ ఈ నెల 21 పది మందితో క్యాంపునకు వెళ్లింది. ఇరవై రోజుల నుంచి కాంగ్రెస్ సహకారంతో ముగ్గురు స్వతంత్రులు ఇప్పటికే క్యాంపులో ఉన్నారు. - హుజూరాబాద్ నగరపంచాయతీని సొంతం చేసుకోవడానికి టీఆర్ఎస్ క్యాంప్ వేసింది. పెద్దపల్లి నగరపంచాయతీపై కన్నేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు క్యాంపులకు వెళ్లాయి. టీడీపీతో కలిసి కాంగ్రెస్ శనివారం, స్వతంత్రులతో కలిసి టీఆర్ఎస్ ఆదివారం తమ కౌన్సిలర్లతో కలిసి క్యాంపులకు వెళ్లారు. - సైదాపూర్ ఎంపీపీ కోసం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు నెల రోజుల నుంచి క్యాంపు నిర్వహిస్తున్నాయి. తమకు మద్దతునిస్తున్న ఎంపీటీసీలతో కలిసి ఢిల్లీ, ఆగ్రా, ముంబయి తదితర ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లారు. ఒక్కో పార్టీ ఖర్చు ఇప్పటికే రూ.15 లక్షలు దాటింది. ముత్తారం, కమానపూర్ ఎంపీపీల కోసం పదిహేను రోజుల నుంచి క్యాంప్‌లు కొనసాగుతున్నాయి. ఊటీ, కొడెకైనాల్ తదితర విహారయాత్రల్లో ఎంపీటీసీలున్నారు. - మండల పరిషత్ క్యాంపులకు రూ.15 నుంచి రూ.20 లక్షలు ఖర్చవుతుండగా, మున్సిపల్ క్యాంపులకు రూ.50 లక్షల వరకు వ్యయం కానుంది. నగరపాలక సంస్థల్లోనైతే పూర్తిస్థాయిలో క్యాంపులు నిర్వహిస్తే కనీసం రూ.కోటి ఖర్చయ్యే అవకాశం ఉండటంతో లెక్కలు వేసుకున్న అభ్యర్థులు వెనుకడుగు వేశారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ!
శ్రీకాకుళం: స్థానిక సంస్థల చైర్మన్ పదవుల ఎన్నిక ప్రక్రియ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక ఆశావహులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆయా సంస్థల్లో ఆధిక్యం సాధించిన పార్టీల్లో చైర్మన్ పదవి ఆశిస్తున్న నేతలు సభ్యుల మద్దతు కూడగ ట్టుకొని నిరీక్షిస్తుండగా ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యం వారిపై ఆర్థిక భారం మోపడంతోపాటు కొత్త సమస్యలు సృష్టిస్తోంది. రెండేళ్లకుపైగా ఎన్నికలకు నోచుకోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు జరపాలని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశిస్తూ.. అందుకు గడువు కూడా నిర్దేశించాయి. ఆ మేరకు రాష్ట్రంతోపాటు జిల్లాలో మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో లెక్కింపు నిర్వహించి, ఫలితాలు కూడా ప్రకటించారు. అయితే ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు ఉండటం, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యేవారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులు కావాల్సి ఉన్నందున.. ఆ తతంగం అంతా పూర్తి అయ్యాకే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థల చైర్మన్ ఎన్నికలపై దృష్టి సారించలేదు. మెజారిటీ సంస్థలను దక్కించుకునేందుకు వీలుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యే వరకు వేచి చూడాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కో-ఆప్షన్ ఓటుతో కొన్ని స్థానాలను దక్కించుకోవచ్చునని అధికార పార్టీ ఆలోచనగా ఉంది. అధికార పార్టీ ఆలోచన ఎలా ఉన్నా చైర్మన్ పదవులపై కన్నేసిన ఆశావహులు మాత్రం సభ్యులను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. నెలల తరబడి క్యాంపుల నిర్వహణ ఖర్చులు భరించలేక బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నికల ఖర్చు కంటే ఈ క్యాంపు ఖర్చే ఎక్కువైపోయిందని కొందరు ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా, ఖచ్చితంగా తమకే పదవి దక్కుతుందో లేదోనన్న అనుమానం కూడా వారిని వేధిస్తోంది. మరోవైపు జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీపై అలక బూనడం వారికి ఆందోళన కలిగిస్తోంది. మంత్రి పదవులు ఆశించిన ఈ ఈ ఇద్దరు నేతలు అవి దక్కకపోవడంతో కినుక వహించారు. వీరిని కలిసి మాట్లాడేందుకు జిల్లా మంత్రి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని సమాచారం. నాయకులు, కార్యకర్తలతో పాటు సహచర ఎమ్మెల్యేలకు సైతం కొన్ని రోజులుగా వారు అందుబాటులో లేరని తెలిసింది. జిల్లా టీడీపీలో మొదటి నుంచీ వర్గాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ ఇద్దరు నేతలు అలక వహించడం మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు హామీ పొందిన వారికే ఈ పదవులు దక్కుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హామీ ఇవ్వని అచ్చెన్న చైర్మన్ పదవుల విషయంలో జిల్లా మంత్రి అచ్చెన్న హామీ పొందేందుకు ఆశావహులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఆయన నుంచి ఖచ్చితమైన హామీ లభించడం లేదు. ఎన్నికలు పూర్తయిన ప్రాంతాలతో పాటు ఎన్నికలు జరగని శ్రీకాకుళం మున్సిపాలిటీ నాయకులు అచ్చెన్నాయుడును కలిసి, ఆయన మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరు వచ్చి కలిసినా కాదనక పోయినప్పటికీ పదవి విషయం వచ్చేసరికి మాత్రం మీ ఎమ్మెల్యేను అడగండి.. అని ఆయన చెబుతుండడంతో పలువురు ఖంగుతింటున్నారు. ఇవన్నీ ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.