సాక్షి, హైదరాబాద్: గతేడాది దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ హైదరాబాద్‌లోనే జరిగింది. నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ నార్సింగి ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇందులో 18 ఎకరాలను నేరుగా కొనుగోలు చేయగా.. మిగిలిన 7 ఎకరాలను జాయింట్ డెవలప్‌మెంట్ కింద దక్కించుకుందని ఈ డీల్‌లో భాగస్వామ్యమైన సీబీఆర్‌ఈ ఇండియా తెలిపింది.
గతేడాది హైదరాబాద్ వ్యవస్థీకృత రియల్టీ మార్కెట్లోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వచ్చే త్రైమాసికాల్లో 50 శాతం మేర వృద్ధి చెందుతాయని పేర్కొంది. ఆయా పెట్టుబడుల్లో ఎక్కువ శాతం వాణిజ్య స్థలాల అభివృద్ధి, రెసిడెన్షియల్ హైరైజ్ బిల్డింగ్స్ విభాగంలోకి వచ్చాయని తెలిపింది. ఈ స్థలంలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచే ప్రీమియం రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నట్లు రాజపుష్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
చదవండి:
రిటైర్మెంట్ హోమ్స్.. పెద్దల కోసం ప్రత్యేక గృహాలు
హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment