
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్ అపార్టుమెంట్‌లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలనికి చేరుకొని పరిశీలించారు. రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకొన్న గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రమ్యకృష్ణకు వివాహం జరిగి ఐదేళ్లు అవుతోందని, ఆమె భర్త గోపి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.
వీరికి కవల పిల్లలు ఉన్నారు. భార్యభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావంటతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఐదేళ్ల క్రితం వివాహం జరిగిందని, తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు లేవని రమ్యకృష్ణ భర్త గోపి తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కలహాలే కారణమా? వేరే ఇబ్బందులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment