
సాక్షి, రంగారెడ్డి : హైదరాబాద్ శివారులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. నార్సింగి ప్రాంతంలోని పుప్పాల్ గూడలో కామాంధులు బరితెగించారు. ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు.. పుప్పాల్ గూడలో ఓ మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేశారు. కామంధుల చెర నుంచి తప్పించుకొన్న మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. పారిపోతున్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా... ఇద్దరు తప్పించుకున్నారు. పట్టుబడ్డ మూడో వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment