
రంగారెడ్డి : వివాహిత మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పెద్దూర్‌తం డా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఎస్‌ఐ బీఎస్‌ఎస్ వరప్రసాద్, తండావాసు లు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దూర్‌తండాకు చెందిన శంకర్ (22) బోరు మెకానిక్‌గా పని చేస్తున్నా డు. వృత్తిలో భాగంగా శంకర్ మంగళవారం మధ్యా హ్నం తండా నుంచి బైక్‌పై ఆమనగల్లు వెళుతుండగా చీపునుంతల శివారు ప్రాంతంలో ఓ వివాహిత అతడిని ఆపి లిఫ్ట్ అడిగింది. దీంతో శంకర్ ఆమెను బైక్‌పై ఎ క్కించుకున్నాడు.
అయితే శంకర్ ఆమెను చుక్కాపూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తర్వా త బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. దీంతో ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను పెద్దూర్‌తండాకు తీసుకువెళ్ళారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న శంకర్ భయంతో తం డా శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment