మరో 30 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు
హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ఐటీ, వ్యాపార ప్రతినిధులే..
నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసుల సన్నాహాలు
ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు పెడ్లర్లు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైజీరియా డ్రగ్ పెడ్లర్ల నుంచి మరో 30 మంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకొని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్రికా దేశాల నుంచి మాదక ద్రవ్యాలను గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను నార్సింగి, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు ఈనెల 16న పట్టుకున్న సంగతి తెలిసిందే. నిందితుల నుంచి రూ.కోట్లు విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ పెడ్లర్లు అనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడేషోలాలతో పాటు బెంగళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, బోరబండకు చెందిన సానబోయిన వరుణ్ కుమార్, కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్‌లను అరెస్టు చేశారు.
సెల్‌ఫోన్లలో డేటాతో..
అరెస్టు సమయంలో నిందితుల సెల్‌ఫోన్లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వాట్సాప్ చాట్స్, సందేశాలు, బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషించారు. దీంతో మరో 30 మంది వీఐపీల పేర్లు బయటికి వచ్చాయి. వీరంతా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారస్తులుగా గుర్తించారు. దీంతో వీరందరికీ నోటీసులు ఇచ్చి, విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
అమన్‌తో సహా మరో 20 మంది..
డ్రగ్ పెడ్లర్ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన మరో 20 మంది మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ వచి్చంది. దీంతో నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్‌తో పాటు ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చ»ౌలికి చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్ కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్, గచి్చబౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ను సరఫరా చేసిన ప్రధాన సూత్రధారులు ఎబుకా సుజీ, ఫ్రాంక్లిన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు.
బండ్లగూడ నుంచే చెల్లింపులు..
డ్రగ్స్ కింగ్‌పిన్ ఎబుకా సుజీ నుంచి బ్లెస్సింగ్‌కు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ఈమె విమానాలు, రైళ్లు, బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను రవాణా చేస్తోంది. ఇప్పటివరకు బ్లెస్సింగ్ 20 సార్లు నగరానికి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చింది. ఈమె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ వీటిని ఏపీలో రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాల్లో వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇందుకుగాను గౌతమ్‌కు నైజీరియన్ నుంచి 9 నెలల్లో రూ.10 లక్షల కమీషన్ అందిందని, బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా నగదు చెల్లింపులు జరిగినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment