హైదరాబాద్ : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. 9 నెలల చిన్నారి మాత్రం తీవ్రంగా గాయపడింది. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని మాత్రం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల మాసాబ్ ట్యాంక్కు చెందిన అంజాద్ ఖాన్, వసీమా బేగమ్గా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.