![Max Verstappen Comes From Ninth On Grid To Win Miami Grand Prix - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/9/max.jpg.webp?itok=RGYAyXFL)
ఫ్లోరిడా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో తన ఆధిపత్యం చాటుకుంటూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ మూడో విజయం నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మయామి గ్రాండ్‌ప్రి రేసులో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల ఈ రేసును తొమ్మిదో స్థానం నుంచి ప్రారంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 27 నిమిషాల 38.241 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సీజన్‌లో ఐదు రేసులు జరగ్గా... ఐదింటిలోనూ రెడ్‌బుల్ డ్రైవర్లే విజేతగా నిలువడం విశేషం. డ్రైవర్స్ చాంపియన్ షిప్ రేసులో వెర్‌స్టాపెన్ (119 పాయింట్లు), పెరెజ్ (105 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment