Formula One: రయ్‌..రయ్‌...రయ్‌...  | Formula One season from today | Sakshi
Sakshi News home page

Formula One: రయ్‌..రయ్‌...రయ్‌... 

Published Sat, Mar 2 2024 1:34 AM | Last Updated on Sat, Mar 2 2024 10:05 AM

Formula One season from today - Sakshi

నేటి నుంచి ఫార్ములావన్‌ సీజన్‌  

సాఖిర్‌: గత ఏడాది పూర్తి ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్‌ జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించాలనే లక్ష్యంతో ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2024 సీజన్‌లో బరిలోకి దిగనుంది. మొత్తం 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు నేడు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి రేసుతో తెర లేవనుంది. శనివారం క్వాలిఫయింగ్‌ సెషన్‌... ఆదివారం ప్రధాన రేసు జరుగుతాయి.

భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 9:30 నుంచి క్వాలిఫయింగ్‌ సెషన్‌ను... ఆదివారం రాత్రి 8:30 నుంచి ప్రధాన రేసును నిర్వహిస్తారు. ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో ఎఫ్‌1 రేసుల ప్రత్యక్ష ప్రసారం ఉంది. గత సీజన్‌లో మొత్తం 22 రేసులు జరగ్గా... రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్లు వెర్‌స్టాపెన్‌ 19 రేసుల్లో, సెర్జియో పెరెజ్‌ 2 రేసుల్లో గెలిచారు. మరో రేసులో ఫెరారీ జట్టుకు చెందిన కార్లోస్‌ సెయింజ్‌ నెగ్గాడు. కొత్త సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టుతోపాటు వెర్‌స్టాపెన్‌ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement