కారు రేసింగ్‌లో పట్టుబడ్డ మంత్రి కుమారుడు | four held, Car racing in banjara hills | Sakshi
Sakshi News home page

కారు రేసింగ్‌లో పట్టుబడ్డ మంత్రి కుమారుడు

Published Sat, Apr 16 2016 6:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

కారు రేసింగ్‌లో పట్టుబడ్డ మంత్రి కుమారుడు

కారు రేసింగ్‌లో పట్టుబడ్డ మంత్రి కుమారుడు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కేంద్రమంత్రి సుజానా చౌదరి కుమారుడు సాయికార్తీక్‌ హల్‌చల్‌ సృష్టించాడు. కారు రేసింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు కారు రేసింగ్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో అతివేగంగా నడుపుతున్న సుజానా కుమారుడు సాయికార్తీక్‌తో పాటు నలుగురు కారు రేసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

అయితే  సాయి కార్తీక్‌ నడుపుతున్న జర్మన్‌ స్పోర్ట్స్‌ కారు నెంబర్‌ ఏపీ09 సీవీ9699 ను సీజ్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం వారందరికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement