సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ రేసింగ్ పోటీలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కార్ రేసింగ్ పోటీలతో నగరంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
► ఖైరతాబాద్ ఫ్లైఓవర్,నెక్లెస్ రోడ్,ఐమాక్స్ రోటరీ వైపు రోడ్ మూసివేత.
► బుద్దభవన్,నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు నో ఎంట్రీ.
► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు.
► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్,ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలకు నో ఎంట్రీ.
► ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే రోడ్స్ క్లోజ్.
► బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు.
► ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్,నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్.
► ఎన్టీఆర్ గార్డెన్, ఎన్‌టీఆర్‌ఘాట్,నెక్లెస్ రోడ్,లుంబినీ పార్క్ రోడ్లు మూసివేతయబడతాయి.
కాగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో గత నెలలో నిర్వహించిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. నవంబర్ 19, 20న జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లు రద్దు చేశారు. తొలి లీగ్ రౌండ్‌లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇండియన్ రేస్ లీగ్ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించింది.
చదవండి: Hyderabad: కుర్రకారు.. ‘సోషల్’ జోరు.. రోజుకు 6 గంటల పాటు వీటితోనే
Comments
Please login to add a commentAdd a comment