Traffic curbs
-
HYD: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏడు గంటల పాటు ఆ రూట్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. వీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ మార్గంలో రాకపోకలను అనుమతించరు. వీవీ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను నిరంకారి, ట్యాంక్‌బండ్ నుంచి పీవీ మార్గ్‌కు వచ్చే వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మీనార్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి తెలుగుతల్లి జంక్షన్ వైపు వచ్చే వాటిని ఇక్బాల్ మీనార్ మీదుగా పంపిస్తారు. శుక్రవారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ నరసింహారావు మార్గ్, లుంబినీ పార్క్ మూసి ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపుల ప్రభావం ఖైరతాబాద్, ఓల్డ్ సైఫాబాద్ పోలీసుస్టేషన్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్, తెలుగుతల్లి, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట, కట్టమైసమ్మ, ట్యాంక్‌బండ్, లిబర్టీ జంక్షన్లపై ఉండనుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 90102 03626 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. చదవండి: దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాం -
హైదరాబాద్‌లోని ఈ రూట్లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి(జనవరి 30) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్‌రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 6 నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. -
Hyderabad: కార్ రేసింగ్ పోటీలతో మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ రేసింగ్ పోటీలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. కార్ రేసింగ్ పోటీలతో నగరంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ► ఖైరతాబాద్ ఫ్లైఓవర్,నెక్లెస్ రోడ్,ఐమాక్స్ రోటరీ వైపు రోడ్ మూసివేత. ► బుద్దభవన్,నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు నో ఎంట్రీ. ► రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు. ► ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్,ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే వాహనాలకు నో ఎంట్రీ. ► ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే రోడ్స్ క్లోజ్. ► బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ► ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్,నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్. ► ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ఘాట్,నెక్లెస్ రోడ్,లుంబినీ పార్క్ రోడ్లు మూసివేతయబడతాయి. కాగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో గత నెలలో నిర్వహించిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. నవంబర్ 19, 20న జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లు రద్దు చేశారు. తొలి లీగ్ రౌండ్లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఇండియన్ రేస్ లీగ్ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించింది. చదవండి: Hyderabad: కుర్రకారు.. ‘సోషల్’ జోరు.. రోజుకు 6 గంటల పాటు వీటితోనే -
సీఎం కేసీఆర్ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ► సెయింట్ జాన్స్ రోటరీ, క్లాక్‌టవర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తాకు అనుమతించరు. సంగీత్ క్రాస్‌రోడ్డు నుంచి ఆలుగడ్డబావి మీదుగా మళ్లిస్తారు. ► ఆలుగడ్డబావి నుంచి ముషీరాబాద్ మార్గం మూసివేస్తారు. ఆలుగడ్డబావి నుంచి వచ్చే వాహనాలు చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి సీతాఫల్మండి, వారాసిగూడ, విద్యానగర్, నల్లకుంట మీదుగా మళ్లిస్తారు. ► ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ మార్గంలో వాహనాలకు అనుమతించరు. ముషీరాబాద్ క్రాస్‌రోడ్డు నుంచి కవాడిగూడ, ఆర్పీరోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అమలులో ఉంటాయి. ► గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్ముని విగ్రహావిష్కరణ, బహిరంగ సభలకు వచ్చే వాహనాలను బోయిగూడ వై జంక్షన్ వద్దగల పారామౌంట్ అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ పక్కనగల గ్రేవియార్డ్ రోడ్డులో ఫోర్‌వీలర్ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. వాటర్‌బోర్డు ఆఫీస్ వద్ద ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. -
hyderabad: రెండు చోట్ల విమోచన వేడుకలు.. ఈ రూట్లలో జర్నీ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా విజయోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.శనివారం మధ్య మండల పరిధిలో రెండు కీలక, భారీ కార్యక్రమాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ►శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగించే బహిరంగ సభ జరుగనున్నాయి. దీనికి రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుంచి 2300 ప్రత్యేక బస్సు ల్లో లక్ష మంది హాజరుకానున్నారని అంచనా. ►ఇది ప్రారంభంకావడానికి ముందు పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వరకు ఐదు వేల మంది కళాకారులు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు నగర నడిబొడ్డున ఉన్నాయి. వీటి ప్రభావం ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ మూడు కి.మీ. పరిధిలోని ప్రాంతాల్లోని ట్రాఫిక్‌పై ఉండనుంది. ►ఈ కార్యక్రమాల నేపథ్యంలో సాధారణ ప్రజలకు, వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా మధ్య మండలంలోని 11 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు వి«ధించారు. ఆయా సమయాల్లో నెక్లెస్ రోడ్‌ను పూర్తిగా మూసి ఉంచుతారు. ►ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆçహూతులు అక్కడ నుంచి కాలినడకన రావాల్సి ఉండటంతో ప్రతి పార్కింగ్ ప్రాంతం నుంచి వేదికలు గరిష్టంగా 1.5 కి.మీ. మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. ►సాధారణ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులకూ ఈ మళ్లింపులు వర్తిస్తాయి. శనివారం సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మెయిన్స్ పరీక్ష ఉంది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో జరిగే పరీక్షకు అభ్యర్థులు వీలైనంత త్వరగా బయలుదేరాలి. ట్రాఫిక్ మళ్లింపులు ఉండే ప్రాంతాల్లో: ►కవాడీగూడ, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వీఎస్టీ, దోమలగూడ, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఐమ్యాక్స్. అస్సలు ప్రయాణించకూడని చౌరస్తాలు: అంబేడ్కర్ స్టాట్యూ, కవాడీగూడ, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్‌బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, లిబర్టీ, నెక్లెస్‌రోడ్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ వీలుంటే జంక్షన్ల మీదుగానూ వద్దు: రవీంద్రభారతి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, బషీర్‌బాగ్, రాణిగంజ్, ఖైరతాబాద్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, ఎల్బీ స్టేడియం, వీఎస్టీ, గాంధీనగర్, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, పబ్లిక్‌గార్డెన్స్, నిజాం కాలేజీ. -
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం పూర్తి
-
కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపే.. నిమజ్జన రూట్‌మ్యాప్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఇంకొద్ది క్షణాల్లో ఉద్విగ్న ఘట్టానికి తెర లేవనుంది. మహా యజ్ఞానికి ముహూర్తం పడనుంది. గణేష్ సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపు కదలనున్నాయి. దాదాపు 24,132 మంది పోలీసులు, 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజాము లోపు నిమజ్జనాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. నిమజ్జన ఊరేగింపులు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శుక్రవారం నుంచి 24 గంటల పాటు నగరంలో మద్యం విక్రయాలు నిషేధించారు. ►శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, ఏపీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీసు ఫోర్స్ బందోబస్తులో ఉంటాయి. 120 బృందాలను షీ–టీమ్స్ రంగంలోకి దింపింది. ►బాలాపూర్– హుస్సేన్‌సాగర్ మధ్య 18.9 కి.మీ మేర ప్రధాన శోభాయాత్ర మార్గం ఉంది. ఇది 11 పోలీసుస్టేషన్ల పరిధిల మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 261 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 739 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ►పాతబస్తీలోని సర్దార్ మహల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ ఔట్‌పోస్ట్ వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఆ చుట్టుపక్కల కలిపి 53 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 2.5 కి.మీ మేర జరిగే ఈ ఊరేగింపుపై నిఘా ఉంచడానికి అదనంగా మరో 24 కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ►ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌లోనే మూడు కమిషనరేట్లలో అనేక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాని చుట్టూ అందుబాటులో ఉన్న 66 సీసీ కెమెరాలకు తోడు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో 27 ఏర్పాటు చేస్తున్నారు. 500 మీటర్ల పరిధిలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌తో పని చేసే 10 మెగా పిక్సల్ కెమెరాలు ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ.. ఎంఎంటీఎస్.. మెట్రో సేవలు హుస్సేన్‌సాగర్ వద్ద నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 565 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శనివారం తెల్లవారు జాము వరకు బస్సులు నడుస్తాయి. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. ఇబ్బందులు రానీయొద్దు: మేయర్ నిమజ్జనం సందర్భంగా కొలనుల వద్ద తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండాలని, వ్యర్థాలు పోగవకుండా పారిశుద్ధ్యం సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు నగర మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెకిలి చేష్టలు వద్దు శోభా యాత్రలో అమ్మాయిలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలకు అరదండాలు తప్పవు. వాటర్ ప్యాకెట్లు చింపి మహిళల మీద చల్లడం, పేపరు ముక్కలను వేయటం, పూలు చల్లడం వంటివి చేస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దు. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు, వీడియోలు తీయటం చేయకూడదు. పోకిరీల వెకిలి చేష్టలను సీసీ కెమెరాలలో రికార్డ్ చేసి, ఆధారాలతో సహా న్యాయస్థానంలో హాజరుపరుస్తాం. – రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్కే సలీమా 196 తాగునీటి శిబిరాలు భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి 196 నీటి క్యాంపులను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న ప్రధాన మార్గాలు, ట్యాంక్ బండ్ పరిసరాలు, నిమజ్జన కొలనుల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తంగా 30.72 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. వినాయకుడికో కోడ్! నిమజ్జన ఊరేగింపుల పర్యవేక్షణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 9 వేల విగ్రహాలను చేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్న గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ గణేష్ నిమజ్జనం సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20, 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 7, 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 43 సహా 13 కిలోమీటర్ల ఎల్టీ కేబుల్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100/1912/ 7901530966/ 790153086లను సంప్రదించాలి. డ్రోన్లతో డేగకన్ను గణేష్ నిమజ్జనానికి సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే 35 చెరువుల వద్ద తొలిసారిగా డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్ 100 లేదా 94906 17444ను సంప్రదించాలి. -
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
► ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ►తుది దశకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ గణపతి ►ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు ఖైరతాబాద్ గణేషుడు.. ► ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా గణేషుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకున్నాడు. అశేష భక్తజన సమూహంలో గణనాథుడు నాలుగో నెంబర్ క్రైన్ వరకు తరలివెళ్తున్నాడు. ►ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చివరిసారిగా భక్తజనం భారీగా తరలివచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేయనున్నారు. ►హుస్సేన్ సాగర్ వద్ద ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వడివడిగా యాత్ర సాగించనున్నారు. మరి కొద్ది సేపటిలో టాంక్ బండ్ వద్దకు బడా గణేష్ విగ్రహం రానుంది. ► గత ఏడాది కన్నా ఈ ఏడాది నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తను దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తీసివేసే పని మొదలు పెడతామన్నారు. ► ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ►ఖైరతాబాద్ గణేష్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేకత ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భారీ జనసమూహం మధ్య ఖైరతాబాద్ వినాయకుడి శోభ యాత్ర #KhairatabadGanesh pic.twitter.com/h31teOJMeW — Latha (@LathaReddy704) September 9, 2022 ►సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. 10వేలమంది పోలీసులు, 10వేలమంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ నిమజ్జనాలు జరుగుతాయనిచ రాత్రి ఎక్కువగా వర్షం కురవడంతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆలస్యం అయిందన్నారు. ► ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న మంత్రి తలసాని. ►బడా గణేషుడిని టస్కర్ మీదికి ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో గణేషుడిని విగ్రహాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రక్రియ మొదలైంది. వంద టన్నులు బరువు మోయగల బరువున్న లారీ, క్రేన్ సహాయంతో నిమర్జన శోభాయాత్ర ఏర్పాట్లు చేశారు. సాక్షి, హైదరాబాద్: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు. ► గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది. ►మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్ మోడల్ మెకానికల్ ట్రయిలర్ ఓల్వో ఇంజిన్ సామర్థ్యం. డీఎస్–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది. ►ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. ►మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు. క్రేన్ నంబర్ 4 వద్దకు.. ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలకల్లా చేరుకోగానే వెల్డింగ్ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. రూట్ మ్యాప్ ఇలా.. ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్ థియేటర్ ముందు నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నం– 4 వద్దకు చేరుకుంటుంది. -
సీఎం జగన్ తిరుపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. వివరాలు ఇలా ఉన్నాయి. ►మదనపల్లి, రాయచోటి, పీలేరు వైపు నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కి వచ్చే భారీ వాహనాలు శ్రీనివాస మంగాపురం నుంచి బైపాస్ మీదుగా మల్లవరం జంక్షన్, రామానుజపల్లి చెక్‌పోస్ట్, రామచంద్రాపురం జంక్షన్, అన్నమయ్య సర్కిల్, శంకరంబాడీ సర్కిల్, రామానుజం సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌లోకి అనుమతిస్తారు. ►చిత్తూరు, మదనపల్లె నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామచంద్రాపురం జంక్షన్ వద్ద నుంచి అన్నమయ్య సర్కిల్, రామానుజం సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్‌స్టాండ్‌లోకి ప్రవేశిస్తాయి. చదవండి: సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే ►తిరుపతి నుంచి బెంగళూరు, చిత్తూరు, మదనపల్లె, రాయచోటి వైపు వెళ్లే బస్సులు లీలా మహల్, నంది సర్కిల్, అలిపిరి గరుడ సర్కిల్, టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ, మహిళా యునివర్సిటీ, రామానుజపల్లి చెక్ పోస్ట్ మీదుగా బైపాస్ వైపు మళ్లిస్తారు. ►చెరోపల్లి వైపు నుంచి వచ్చే టూవీలర్, త్రీవీలర్, కార్లు విద్యానగర్ వద్ద ఫ్లైఓవర్ పక్కనున్న సర్వీస్ రోడ్ నుంచి తుమ్మలగుంట మీదుగా తిరుపతి టౌన్లోకి అనుమతిస్తారు. ►అలాగే బాలాజీ కాలనీ నుంచి చెరోపల్లి వైపు వెళ్లే వాహనాలను మహిళా యునివర్సిటీ, తుమ్మగుంట క్రాస్ మీదుగా మళ్లిస్తారు. ►విద్యానగర్ కాలనీ–బాలాజీ కాలనీ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు. ►రాళ్లపల్లి జంక్షన్ నుంచి ఎస్వీ యునివర్సిటీ పోలీస్‌స్టేషన్ మీదుగా ఎన్సీసీ క్యాంటీన్ వరకు వాహనాలను అనుమతించరు. అలాగే గరుడ సర్కిల్ నుంచి చెరోపల్లి వరకు వాహనాలు అనుమతించరు. ► అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. -
హైదరాబాద్‌లో 45 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి,సనత్‌నగర్: జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)–2 కింద బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్ నాలాపై జరిగే బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్ఎన్డీపీ ఈ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ఆ మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జూన్ 4 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్.. రాకపోకలు ఇలా.. సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ నుంచి రసూల్‌పురా జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ దేవాలయం వద్ద లేన్ (యాత్రి నివాస్ దగ్గర) వద్ద ఎడమ వైపు మళ్లీ..పీజీ రోడ్డు, ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ కుడి వైపు, మినిస్టర్ రోడ్డు మీదుగా రసూల్ పురా ‘టి’ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ► కిమ్స్ ఆస్పత్రి నుంచి రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు న్యూ రాంగోపాల్‌పేట పీఎస్ ఎదురుగా సింథికాలనీ, పీజీ రోడ్డు వైపు రైట్ టర్న్ తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. ►బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వచ్చే కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనదారులు రసూల్‌పురా ‘టి’ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ►హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్, రసూల్‌పురా ‘టి’ జంక్షన్ మధ్య ‘వన్ వే’గా గుర్తించారు. ►సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు గూడ్స్ వాహనాలతో పాటు ప్రైవేటు, స్కూల్స్, కాలేజీ బస్సులు వంటి రవాణా వాహనాలను అనుమతించరు. అవి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: లెక్క తప్పైతే మంత్రి పదవి రాజీనామా చేస్తా: కేటీఆర్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే మార్గాలు ఇవీ.. పంజగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని, హనుమాన్ టెంపుల్ లేన్, ఫుడ్‌వరల్డ్, రాంగోపాల్‌పేట పీఎస్ ఎడమ మలుపు నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాలి. ►పంజగుట్ట ఎక్స్‌రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైవర్, నెక్లెస్ రోటరీ, పీవీఎన్ఆర్ మార్గ్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►సీటీఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్ జంక్షన్ కుడి వైపు తిరిగి, మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. ►కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్, రాణిగంజ్ జంక్షన్ ఎడమ మలుపు, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ లేదా బుద్ధభవన్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. -
హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం నగరానికి రానున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 29లోని తన నివాసం నుంచి బోయిన్‌పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ (ఎన్ఐఈపీఐడీ)కు వెళతారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, శ్రీనగర్ టీ జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్, పంజగుట్ట ఫ్లై ఓవర్, మోనప్ప జంక్షన్, సీఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవర్, బేగంపేట ఫ్లై ఓవర్, పీఎన్టీ ఫ్లై ఓవర్, రసూల్‌పురా జంక్షన్, సీటీఓ ఫ్లై ఓవర్, ప్లాజా జంక్షన్, కార్ఖానా హనుమాన్ టెంపుల్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్, ఎన్ఐఈపీఐడీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగిసిన అనంతరం.. తిరిగి అదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ఎంచుకోవాలని ఆయన సూచించారు. చదవండి: బోయిగూడ అగ్నిప్రమాదం.. గాయపడిన ప్రేమ్ మృతి -
Hanuman Shobha Yatra: ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి నేపథ్యంలో జరిగే విజయ్ యాత్రకు పోలీసు విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన ఊరేగింపు గౌలిగూడ రామ్ మందిర్‌లో ఉదయం 11.30 గంటలకు మొదలై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వద్ద రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఈ మార్గంలోని వివిధ ప్రాంతాల మీదుగా 12 కి.మీ సాగుతుంది. మరో ఊరేగింపు రాచకొండ పరిధిలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద మొదలై వివిధ మార్గాల్లో 10.8 కి.మీ ప్రయాణిస్తూ కోఠి ఉమెన్స్ కాలేజ్ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది. ఈ మ్యాప్‌ను పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు మినహా కొత్త ఊరేగింపులకు ప్రధాన ఊరేగింపులో కలవడానికి అనుమతించరు. నగర పోలీసులతో పాటు ఇతర విభాగాలతో కలిపి మొత్తం 8 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఆర్టీసీ సహా వివిధ విభాగాలతో భేటీ అయిన నగర పోలీసులు సమన్వయంతో ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. #HYDTPinfo Commuters, please note traffic diversions in connection with the “Sri Hanuman Jayanthi Vijaya Yathra” procession on 16-04-2022 at 0900 hours, starting from Gowliguda Ram Mandir to Tadbund Sri Veeranjaneya Swamy Temple. pic.twitter.com/BrOuGXBy0D — Hyderabad Traffic Police (@HYDTP) April 15, 2022 రూట్‌మ్యాప్ ► బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో అన్ని శాఖలకు కలిపి ఉమ్మడి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సున్నిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ స్పేస్ పోలీసింగ్‌లో భాగంగా సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ► ఊరేగింపుపై షీ– టీమ్స్, మఫ్టీ పోలీసులు కన్నేసి ఉంచనున్నారు. విజయ్ యాత్ర జరిగే మార్గాలతో పాటు చుట్టుపక్కల రూట్లలోనూ ముమ్మర తనిఖీలు, సోదాలు చేయనున్నారు. ఊరేగింపు నేపథ్యంలో శనివారం మద్యం విక్రయాలను నిషేధించారు. యాత్ర జరిగే మార్గాల్లో శుక్రవారం పర్యటించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షించారు. ► బందోబస్తుతో పాటు ఇతర అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘శనివారం పనిదినం కావడంతో సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నాం. ఊరేగింపు జరిగే మార్గాల్లోని ఎత్తైన భవనాలపై ఉండే ప్రత్యేక సిబ్బంది రూఫ్ టాప్ వాచ్ నిర్వహిస్తారు. అవసరమైన స్థాయిలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లును వాడుతున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఈ ప్రాంతాల్లోనే.. శనివారం ఉదయం 11.30– 12 గంటల మధ్య గౌలిగూడ నుంచి విజయ్ యాత్ర మొదలవుతుంది. మరో కర్మన్‌ఘాట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపులు ఏయే ప్రాంతాలకు చేరుకుంటే అక్కడ, ఆయా సమయాల్లో మళ్లింపులు, ఆంక్షలు అమలవుతాయి. నిర్దేశిత సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా 040– 27852482, 90102 03626, లేదా హైదరాబాద్ పోలీసు సోషల్‌మీడియా యాప్స్‌ను సంప్రదింవచ్చు. -
హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆదివారం 'హైదరాబాద్ 10కే రన్' జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని వాహన చోదకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని సహకరించాలని కోరారు. - రాజ్‌భవన్, ఆనంద్‌నగర్, పంజగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను వీవీ స్టాట్యూ(ఖైరతాబాద్ చౌరస్తా) నుంచి నిరంకారి వైపు పంపిస్తారు. - మింట్ కాంపౌండ్, ఐ-మాక్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు పంపిస్తారు. - ఇక్బాల్ మీనార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలను తెలుగు తల్లి చౌరస్తా, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెక్రటేరియేట్ పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ చౌరస్తా, బైబిల్ హౌస్ మీదుగా మళ్ళిస్తారు. - హిల్‌ఫోర్ట్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించకుండా తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. - లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని జీహెచ్ఎంసీ ఆఫీస్, ఐటీ లైన్, హిమాయత్‌నగర్‌ల వైపు పంపిస్తారు. - డీబీఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను చిల్డ్రన్స్ పార్క్, అప్పర్‌ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. వీటిని కట్ట మైసమ్మ దేవాలయం, కవాడీగూడ మీదుగా మళ్ళిస్తారు. - రసూల్‌పుర నుంచి నల్లగుట్ట రైల్ అండర్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ చౌరస్తా మీదుగా మళ్ళిస్తారు. -
గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు
-
ముస్తాబవుతున్న గోల్కొండ కోట
-
బక్రీద్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగరంలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.00 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగరపోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఆ మూడు ప్రధాన ఈద్గాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలలోగా మీర్ఆలం, బాలంరాయి, సికింద్రబాద్ ఈద్గాలకు చేరుకోవాలని పోలీసులు ముస్లిం సోదరులకు సూచించారు. ప్రార్ధనల సమయంలో ఈద్గాల వైపు సాధారణ వాహనాలను కూడా అనుమతించమన్నారు. ప్రార్ధనలు జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.