సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా విజయోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.శనివారం మధ్య మండల పరిధిలో రెండు కీలక, భారీ కార్యక్రమాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
►శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగించే బహిరంగ సభ జరుగనున్నాయి. దీనికి రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుంచి 2300 ప్రత్యేక బస్సు ల్లో లక్ష మంది హాజరుకానున్నారని అంచనా.
►ఇది ప్రారంభంకావడానికి ముందు పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వరకు ఐదు వేల మంది కళాకారులు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు నగర నడిబొడ్డున ఉన్నాయి. వీటి ప్రభావం ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ మూడు కి.మీ. పరిధిలోని ప్రాంతాల్లోని ట్రాఫిక్‌పై ఉండనుంది.
►ఈ కార్యక్రమాల నేపథ్యంలో సాధారణ ప్రజలకు, వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా మధ్య మండలంలోని 11 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు వి«ధించారు. ఆయా సమయాల్లో నెక్లెస్ రోడ్‌ను పూర్తిగా మూసి ఉంచుతారు.
►ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆçహూతులు అక్కడ నుంచి కాలినడకన రావాల్సి ఉండటంతో ప్రతి పార్కింగ్ ప్రాంతం నుంచి వేదికలు గరిష్టంగా 1.5 కి.మీ. మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు.
►సాధారణ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులకూ ఈ మళ్లింపులు వర్తిస్తాయి. శనివారం సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మెయిన్స్ పరీక్ష ఉంది. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో జరిగే పరీక్షకు అభ్యర్థులు వీలైనంత త్వరగా బయలుదేరాలి.
ట్రాఫిక్ మళ్లింపులు ఉండే ప్రాంతాల్లో:
►కవాడీగూడ, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వీఎస్టీ, దోమలగూడ, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఐమ్యాక్స్.
అస్సలు ప్రయాణించకూడని చౌరస్తాలు:
అంబేడ్కర్ స్టాట్యూ, కవాడీగూడ, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్‌బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, లిబర్టీ, నెక్లెస్‌రోడ్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్
వీలుంటే జంక్షన్ల మీదుగానూ వద్దు:
రవీంద్రభారతి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, బషీర్‌బాగ్, రాణిగంజ్, ఖైరతాబాద్ జంక్షన్, పోలీసు కంట్రోల్ రూమ్, ఎల్బీ స్టేడియం, వీఎస్టీ, గాంధీనగర్, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, పబ్లిక్‌గార్డెన్స్, నిజాం కాలేజీ.
Comments
Please login to add a commentAdd a comment