
పార్క్‌లేన్ నుంచి గాంధీ ఆస్పత్రికి సీఎం వచ్చే రూట్‌మ్యాప్
సాక్షి, హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
► సెయింట్ జాన్స్ రోటరీ, క్లాక్‌టవర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తాకు అనుమతించరు. సంగీత్ క్రాస్‌రోడ్డు నుంచి ఆలుగడ్డబావి మీదుగా మళ్లిస్తారు.
► ఆలుగడ్డబావి నుంచి ముషీరాబాద్ మార్గం మూసివేస్తారు. ఆలుగడ్డబావి నుంచి వచ్చే వాహనాలు చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి సీతాఫల్‌మండి, వారాసిగూడ, విద్యానగర్, నల్లకుంట మీదుగా మళ్లిస్తారు.
► ఆర్‌టీసీ క్రాస్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ మార్గంలో వాహనాలకు అనుమతించరు. ముషీరాబాద్ క్రాస్‌రోడ్డు నుంచి కవాడిగూడ, ఆర్‌పీరోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అమలులో ఉంటాయి.
► గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్ముని విగ్రహావిష్కరణ, బహిరంగ సభలకు వచ్చే వాహనాలను బోయిగూడ వై జంక్షన్ వద్దగల పారామౌంట్ అపార్ట్‌మెంట్, అపార్ట్‌మెంట్ పక్కనగల గ్రేవియార్డ్ రోడ్డులో ఫోర్‌వీలర్ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. వాటర్‌బోర్డు ఆఫీస్ వద్ద ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సదుపాయం
కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment