సాక్షి, సిటీబ్యూరో: ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
వీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ మార్గంలో రాకపోకలను అనుమతించరు. వీవీ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను నిరంకారి, ట్యాంక్‌బండ్ నుంచి పీవీ మార్గ్‌కు వచ్చే వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మీనార్ వైపు నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి తెలుగుతల్లి జంక్షన్ వైపు వచ్చే వాటిని ఇక్బాల్ మీనార్ మీదుగా పంపిస్తారు.
శుక్రవారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ నరసింహారావు మార్గ్, లుంబినీ పార్క్ మూసి ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపుల ప్రభావం ఖైరతాబాద్, ఓల్డ్ సైఫాబాద్ పోలీసుస్టేషన్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్, తెలుగుతల్లి, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట, కట్టమైసమ్మ, ట్యాంక్‌బండ్, లిబర్టీ జంక్షన్లపై ఉండనుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 90102 03626 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
చదవండి: దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాం
Comments
Please login to add a commentAdd a comment