Jagan Tirupati Tour: Police Announce Traffic Curbs in Tirupati In View of CM YS Jagan Visit - Sakshi
Sakshi News home page

AP CM Tirupati Tour: సీఎం జగన్‌ తిరుపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు

Published Thu, May 5 2022 8:14 AM | Last Updated on Thu, May 5 2022 10:54 AM

Police Announce Traffic Curbs in Tirupati In View of CM YS jagan Visit - Sakshi

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

►మదనపల్లి, రాయచోటి, పీలేరు వైపు నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కి వచ్చే భారీ వాహనాలు శ్రీనివాస మంగాపురం నుంచి బైపాస్‌ మీదుగా మల్లవరం జంక్షన్, రామానుజపల్లి చెక్‌పోస్ట్, రామచంద్రాపురం జంక్షన్, అన్నమయ్య సర్కిల్, శంకరంబాడీ సర్కిల్, రామానుజం సర్కిల్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌లోకి అనుమతిస్తారు. 

►చిత్తూరు, మదనపల్లె నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామచంద్రాపురం జంక్షన్‌ వద్ద నుంచి అన్నమయ్య సర్కిల్, రామానుజం సర్కిల్‌ మీదుగా ఆర్టీసీ బస్‌స్టాండ్‌లోకి ప్రవేశిస్తాయి.

చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

►తిరుపతి నుంచి బెంగళూరు, చిత్తూరు, మదనపల్లె, రాయచోటి వైపు వెళ్లే బస్సులు లీలా మహల్, నంది సర్కిల్, అలిపిరి గరుడ సర్కిల్, టౌన్‌ క్లబ్, బాలాజీ కాలనీ, మహిళా యునివర్సిటీ, రామానుజపల్లి చెక్‌ పోస్ట్‌ మీదుగా బైపాస్‌ వైపు మళ్లిస్తారు. 

►చెరోపల్లి వైపు నుంచి వచ్చే టూవీలర్, త్రీవీలర్, కార్లు విద్యానగర్‌ వద్ద ఫ్లైఓవర్‌ పక్కనున్న సర్వీస్‌ రోడ్‌ నుంచి తుమ్మలగుంట మీదుగా తిరుపతి టౌన్‌లోకి అనుమతిస్తారు. 

►అలాగే బాలాజీ కాలనీ నుంచి చెరోపల్లి వైపు వెళ్లే వాహనాలను మహిళా యునివర్సిటీ, తుమ్మగుంట క్రాస్‌ మీదుగా మళ్లిస్తారు. 

►విద్యానగర్‌ కాలనీ–బాలాజీ కాలనీ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు.  

►రాళ్లపల్లి జంక్షన్‌ నుంచి ఎస్వీ యునివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ మీదుగా ఎన్‌సీసీ క్యాంటీన్‌ వరకు వాహనాలను అనుమతించరు. అలాగే గరుడ సర్కిల్‌ నుంచి చెరోపల్లి వరకు వాహనాలు అనుమతించరు.

► అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement