
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం నగరానికి రానున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 29లోని తన నివాసం నుంచి బోయిన్‌పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ (ఎన్‌ఐఈపీఐడీ)కు వెళతారు.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్‌టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, శ్రీనగర్ టీ జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్, పంజగుట్ట ఫ్లై ఓవర్, మోనప్ప జంక్షన్, సీఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవర్, బేగంపేట ఫ్లై ఓవర్, పీఎన్‌టీ ఫ్లై ఓవర్, రసూల్‌పురా జంక్షన్, సీటీఓ ఫ్లై ఓవర్, ప్లాజా జంక్షన్, కార్ఖానా హనుమాన్ టెంపుల్, బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్, ఎన్‌ఐఈపీఐడీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగిసిన అనంతరం.. తిరిగి అదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ఎంచుకోవాలని ఆయన సూచించారు.
చదవండి: బోయిగూడ అగ్నిప్రమాదం.. గాయపడిన ప్రేమ్ మృతి