సత్తాచాటిన ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్లు | ssbn teams won in inter college games | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్లు

Published Sun, Oct 2 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

సత్తాచాటిన ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్లు

సత్తాచాటిన ఎస్‌ఎస్‌బీఎన్‌ జట్లు

♦  వాలీబాల్, కబడ్డీ, బాల్‌బాడ్మింటన్, బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో విజేత
హిందూపురం టౌన్‌ : పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహించిన ఎస్కేయూ అంతర్‌ కళాశాలల క్రీడాపోటీల్లో అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల జట్టు పలు విభాగాల్లో సత్తాచాటి విజేతగా నిలిచింది.  పోటీలు ఆదివారం ముగిశాయి.  స్థానిక ఎస్‌ఎస్‌పీఆర్‌ కళాశాలలో  ఆదివారం నిర్వహించిన ముగింపు  కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందజేశారు.కార్యక్రమానికి ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ శంకరయ్య అధ్యక్షత వహించారు.  ముఖ్యఅతిథిగా ఎస్కేయూ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ జెస్సీ పాల్గొన్నారు.  హాకీ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అలాగే  తైక్వాండో, జూడో, ఫెన్సింగ్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎస్కేయు జట్టుకు ఎంపిక చేశారు.   వైస్‌ ప్రిన్సిపల్‌ అంజలీదేవి, కోఆర్డినేటర్‌ యశోదారాణి, పీడీలు వెంకట నాయుడు, కెనడీ, చంద్ర, శ్రీరామ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

పోటీల్లో విజేతలు వీరే..
– వాలీబాల్‌ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్‌ కళాశాల (అనంతపురం) విన్నర్స్,  శ్రీ వాణి వ్యాయామ కళాశాల(హిందూపురం) రన్నర్స్‌
– షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం) విన్నర్స్, ఎస్కేయు కళాశాల(అనంతపురం) రన్నర్స్‌.
–  కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల విన్నర్స్,  ఎస్వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) రన్నర్స్‌.
– టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఆర్ట్స్‌ కళాశాల(అనంతపురం) ప్రథమస్థానంలో, ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ద్వితీయస్థానంలో నిలిచింది.
– బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల విన్నర్స్, కేఎస్‌ఎన్‌ కళాశాల (అనంతపురం) రన్నర్స్‌.
– బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్‌ కళాశాల విన్నర్స్,  కేఎస్‌ఎన్‌ కళాశాల (అనంతపురం)  రన్నర్స్‌.
– ఖో ఖో పోటీల్లో ఎస్‌కేపీ కళాశాల(గుంతకల్లు) విన్నర్స్, కెఎస్‌ఎన్‌ కళాశాల (అనంతపురం) రన్నర్స్‌.
– యోగా పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల విన్నర్స్,  సప్తగిరి కళాశాల (హిందూపురం) రన్నర్స్‌గా నిలిచారు.
. చెస్‌ పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం), ఎస్‌వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) కళాశాలలకు జాయింట్‌ విన్నర్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement