inter college games
-
విల్లామేరీ ‘హ్యాట్రిక్’ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో విల్లామేరీ మహిళా డిగ్రీ, పీజీ కాలేజి (సోమాజిగూడ) జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో ఏడాది ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో విల్లా మేరీ కాలేజి 7–3 తేడాతో సెయింట్ ఆన్స్ డిగ్రీ, పీజీ కాలేజి (మెహిదీపట్నం) జట్టును ఓడించింది. విజేత జట్టులో దుర్గ 3 గోల్స్ చేయగా... సెయింట్ ఆన్స్ తరఫున నన్షిత 3 గోల్స్‌తో ఆకట్టుకుంది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో భవన్స్ వివేకానంద కాలేజి 5–2తో సెయింట్ పాయిస్ కాలేజిపై గెలుపొందింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ ఇంటర్ కాలేజియేట్ కార్యదర్శి ప్రొఫెసర్ సునీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
‘మిస్టర్ ఉస్మానియా’ షేక్ అన్వర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి బెస్ట్ ఫిజిక్ పురుషుల చాంపియన్‌షిప్‌లో షేక్ అన్వర్, సాయి రోషన్ సత్తా చాటారు. హైదరాబాద్ ప్రెసిడెన్సీ పీజీ కాలేజి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. 75కేజీల వెయిట్ కేటగిరీలో శ్రీవేద కాలేజికి చెందిన షేక్ అన్వర్ చాంపియన్‌గా నిలవగా, బద్రుకా కాలేజికి చెందిన కె. ప్రదీప్ రన్నరప్‌గా నిలిచాడు. అన్వర్ ఉలూమ్ కాలేజికి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఖురేషి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన అన్వర్‌కు ‘మిస్టర్ ఉస్మానియా’ అవార్డు లభించింది. 85 కేజీల వెయిట్ కేటగిరీలో వెస్లీ డిగ్రీ కాలేజికి చెందిన సాయి రోషన్, సుప్రభాత్ కాలేజికి చెందిన శివ కుమార్, మహాత్మా గాంధీ కాలేజికి చెందిన పీఎస్ఎస్ పృథ్వీ వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. అన్వర్ ఉలూమ్ డిగ్రీ కాలేజి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు 60 కేజీలు: 1. షేక్ నజీమ్ అలీ (అన్వర్ ఉలూమ్), 2. మొహమ్మద్ జవీద్ ఖాద్రి (అన్వర్ ఉలూమ్), 3. గంగరాజు ఆదిత్య (బద్రుకా). 65 కేజీలు: 1. హుస్సేన్ టిమిని (నిజాం కాలేజి), 2. ముస్తఫా (అన్వర్ ఉలూమ్). 3. షేక్ అలీ బావజీర్ (స్వాతి డిగ్రీ కాలేజి). 70 కేజీలు: 1. సయ్యద్ యూసుఫ్ అలీ (సెయింట్ జోసెఫ్), 2. మొహమ్మద్ అమీర్ (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజి), 3. మొహమ్మద్ సమీర్ (షాదాన్ డిగ్రీ కాలేజి). 80 కేజీలు: 1. అంజద్ ఉల్లా ఖాన్ (ఎస్వీ డిగ్రీ కాలేజి), 2. మొహమ్మద్ అబ్రార్ ఆలం ఖాన్ (అలియన్స్ డిగ్రీ కాలేజి), 3. మొహమ్మద్ అబ్దుల్ షాహిద్ (అలియన్స్ డిగ్రీ కాలేజి). 90 కేజీలు: 1. అహ్మద్ బిన్ అబ్దుల్ (గెలాక్సీ డిగ్రీ కాలేజి), 2. అమ్రు బిన్ నసీర్. 95 కేజీలు: 1. రవూఫ్ అహ్మద్‌ఖాన్ (సుల్తాన్ ఉలూమ్ కాలేజి), 2. సర్ఫరాజ్ హుస్సేన్ (ఎంజే ఇంజనీరింగ్ కాలేజి). , -
ముగిసిన అంతర్ కళాశాలల పోటీలు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అంతర్ కళాశాలల గ్రూప్–ఎ పోటీలు ముగిశాయి. శుక్రవారం పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోటీలు హోరాహోరీగా జరిగాయి. చివరిరోజు కళాశాల ప్రిన్సిపల్ కె.సురేష్, ఎస్కేయూ ప్రతినిధి జెస్సి, పీడీ శ్రీరామ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.క్రిష్ణయ్యలు పర్యవేక్షించారు. బహుమతుల ప్రదానోత్సవానికి ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మురళీధర్‌రావు, ఎస్కేయూ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిటైర్డ్ ఆంగ్ల అధ్యాపకులు బాలగంగాధర్ చేతులమీదుగా గెలుపొందిన క్రీడాకారులకు మెమెంటోలు అందించారు. బాల్‌బ్యాడ్మింటన్‌లో అనంతపురం ఆర్ట్స్ కళాశాల విన్నర్‌గా, ఎస్కేయూ జట్టు రన్నర్స్‌గా నిలిచారు. టేబుల్ టెన్నిస్‌లో విన్నర్‌గా అనంతపురం ఎస్కేయూ, రన్నర్స్‌గా రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచింది. అలాగే చదరంగంలో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విజేతగా, అనంతపురం ఎస్వి డిగ్రీ కళాశాల రన్నర్‌గా నిలిచాయి. త్రోబాల్‌లో విన్నర్స్‌గా ఆర్ట్స్ కళాశాల, రన్నర్స్‌గా ఉరవకొండ డిగ్రీ కళాశాలలు గెలుపొందాయి. -
సత్తాచాటిన ఎస్ఎస్బీఎన్ జట్లు
♦ వాలీబాల్, కబడ్డీ, బాల్‌బాడ్మింటన్, బాస్కెట్ బాల్ పోటీల్లో విజేత హిందూపురం టౌన్ : పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహించిన ఎస్కేయూ అంతర్ కళాశాలల క్రీడాపోటీల్లో అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల జట్టు పలు విభాగాల్లో సత్తాచాటి విజేతగా నిలిచింది. పోటీలు ఆదివారం ముగిశాయి. స్థానిక ఎస్‌ఎస్‌పీఆర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందజేశారు.కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శంకరయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్కేయూ స్పోర్ట్స్ డైరెక్టర్ జెస్సీ పాల్గొన్నారు. హాకీ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అలాగే తైక్వాండో, జూడో, ఫెన్సింగ్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎస్కేయు జట్టుకు ఎంపిక చేశారు. వైస్ ప్రిన్సిపల్ అంజలీదేవి, కోఆర్డినేటర్ యశోదారాణి, పీడీలు వెంకట నాయుడు, కెనడీ, చంద్ర, శ్రీరామ్, క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలు వీరే.. – వాలీబాల్ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్ కళాశాల (అనంతపురం) విన్నర్స్, శ్రీ వాణి వ్యాయామ కళాశాల(హిందూపురం) రన్నర్స్ – షటిల్ బ్యాడ్మింటన్‌లో ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం) విన్నర్స్, ఎస్కేయు కళాశాల(అనంతపురం) రన్నర్స్. – కబడ్డీ పోటీల్లో ఎస్ఎస్బీఎన్ కళాశాల విన్నర్స్, ఎస్వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) రన్నర్స్. – టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆర్ట్స్ కళాశాల(అనంతపురం) ప్రథమస్థానంలో, ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ద్వితీయస్థానంలో నిలిచింది. – బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఎస్ఎస్బీఎన్ కళాశాల విన్నర్స్, కేఎస్ఎన్ కళాశాల (అనంతపురం) రన్నర్స్. – బాస్కెట్ బాల్ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్ కళాశాల విన్నర్స్, కేఎస్ఎన్ కళాశాల (అనంతపురం) రన్నర్స్. – ఖో ఖో పోటీల్లో ఎస్కేపీ కళాశాల(గుంతకల్లు) విన్నర్స్, కెఎస్ఎన్ కళాశాల (అనంతపురం) రన్నర్స్. – యోగా పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విన్నర్స్, సప్తగిరి కళాశాల (హిందూపురం) రన్నర్స్‌గా నిలిచారు. . చెస్ పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం), ఎస్వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) కళాశాలలకు జాయింట్ విన్నర్స్.