విల్లామేరీ ‘హ్యాట్రిక్‌’ టైటిల్స్‌ | villa marie gets hat trick tiles | Sakshi
Sakshi News home page

విల్లామేరీ ‘హ్యాట్రిక్‌’ టైటిల్స్‌

Published Sun, Oct 22 2017 12:11 PM | Last Updated on Sun, Oct 22 2017 12:11 PM

villa merie college team

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్‌ కాలేజి హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో విల్లామేరీ మహిళా డిగ్రీ, పీజీ కాలేజి (సోమాజిగూడ) జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో ఏడాది ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో విల్లా మేరీ కాలేజి 7–3 తేడాతో సెయింట్‌ ఆన్స్‌ డిగ్రీ, పీజీ కాలేజి (మెహిదీపట్నం) జట్టును ఓడించింది.

విజేత జట్టులో దుర్గ 3 గోల్స్‌ చేయగా... సెయింట్‌ ఆన్స్‌ తరఫున నన్షిత 3 గోల్స్‌తో ఆకట్టుకుంది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో భవన్స్‌ వివేకానంద కాలేజి 5–2తో సెయింట్‌ పాయిస్‌ కాలేజిపై గెలుపొందింది. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ ఇంటర్‌ కాలేజియేట్‌ కార్యదర్శి ప్రొఫెసర్‌ సునీల్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement