ముగిసిన అంతర్ కళాశాలల పోటీలు
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అంతర్ కళాశాలల గ్రూప్–ఎ పోటీలు ముగిశాయి. శుక్రవారం పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోటీలు హోరాహోరీగా జరిగాయి. చివరిరోజు కళాశాల ప్రిన్సిపల్ కె.సురేష్, ఎస్‌కేయూ ప్రతినిధి జెస్సి, పీడీ శ్రీరామ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.క్రిష్ణయ్యలు పర్యవేక్షించారు. బహుమతుల ప్రదానోత్సవానికి ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మురళీధర్‌రావు, ఎస్‌కేయూ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిటైర్డ్ ఆంగ్ల అధ్యాపకులు బాలగంగాధర్ చేతులమీదుగా గెలుపొందిన క్రీడాకారులకు మెమెంటోలు అందించారు.
బాల్‌బ్యాడ్మింటన్‌లో అనంతపురం ఆర్ట్స్ కళాశాల విన్నర్‌గా, ఎస్‌కేయూ జట్టు రన్నర్స్‌గా నిలిచారు. టేబుల్ టెన్నిస్‌లో విన్నర్‌గా అనంతపురం ఎస్‌కేయూ, రన్నర్స్‌గా రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచింది. అలాగే చదరంగంలో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విజేతగా, అనంతపురం ఎస్‌వి డిగ్రీ కళాశాల రన్నర్‌గా నిలిచాయి. త్రోబాల్‌లో విన్నర్స్‌గా ఆర్ట్స్ కళాశాల, రన్నర్స్‌గా ఉరవకొండ డిగ్రీ కళాశాలలు గెలుపొందాయి.