సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి బెస్ట్ ఫిజిక్ పురుషుల చాంపియన్‌షిప్‌లో షేక్ అన్వర్, సాయి రోషన్ సత్తా చాటారు. హైదరాబాద్ ప్రెసిడెన్సీ పీజీ కాలేజి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. 75కేజీల వెయిట్ కేటగిరీలో శ్రీవేద కాలేజికి చెందిన షేక్ అన్వర్ చాంపియన్‌గా నిలవగా, బద్రుకా కాలేజికి చెందిన కె. ప్రదీప్ రన్నరప్‌గా నిలిచాడు. అన్వర్ ఉలూమ్ కాలేజికి చెందిన మొహమ్మద్ యూసుఫ్ ఖురేషి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన అన్వర్‌కు ‘మిస్టర్ ఉస్మానియా’ అవార్డు లభించింది. 85 కేజీల వెయిట్ కేటగిరీలో వెస్లీ డిగ్రీ కాలేజికి చెందిన సాయి రోషన్, సుప్రభాత్ కాలేజికి చెందిన శివ కుమార్, మహాత్మా గాంధీ కాలేజికి చెందిన పీఎస్‌ఎస్ పృథ్వీ వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. అన్వర్ ఉలూమ్ డిగ్రీ కాలేజి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు
60 కేజీలు: 1. షేక్ నజీమ్ అలీ (అన్వర్ ఉలూమ్), 2. మొహమ్మద్ జవీద్ ఖాద్రి (అన్వర్ ఉలూమ్), 3. గంగరాజు ఆదిత్య (బద్రుకా).
65 కేజీలు: 1. హుస్సేన్ టిమిని (నిజాం కాలేజి), 2. ముస్తఫా (అన్వర్ ఉలూమ్). 3. షేక్ అలీ బావజీర్ (స్వాతి డిగ్రీ కాలేజి).
70 కేజీలు: 1. సయ్యద్ యూసుఫ్ అలీ (సెయింట్ జోసెఫ్), 2. మొహమ్మద్ అమీర్ (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజి), 3. మొహమ్మద్ సమీర్ (షాదాన్ డిగ్రీ కాలేజి).
80 కేజీలు: 1. అంజద్ ఉల్లా ఖాన్ (ఎస్‌వీ డిగ్రీ కాలేజి), 2. మొహమ్మద్ అబ్రార్ ఆలం ఖాన్ (అలియన్స్ డిగ్రీ కాలేజి), 3. మొహమ్మద్ అబ్దుల్ షాహిద్ (అలియన్స్ డిగ్రీ కాలేజి).
90 కేజీలు: 1. అహ్మద్ బిన్ అబ్దుల్ (గెలాక్సీ డిగ్రీ కాలేజి),
2. అమ్రు బిన్ నసీర్.
95 కేజీలు: 1. రవూఫ్ అహ్మద్‌ఖాన్ (సుల్తాన్ ఉలూమ్ కాలేజి), 2. సర్ఫరాజ్ హుస్సేన్ (ఎంజే ఇంజనీరింగ్ కాలేజి).
,
Comments
Please login to add a commentAdd a comment