సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్ క్లాసికల్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఖాతాలో మూడో విజయం చేరింది. రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్)తో మంగళవారం స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 44 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నేడు జరిగే ఏడో రౌండ్‌లో డేవిడ్ గిజారో (స్పెయిన్)తో హరికృష్ణ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment