జూనియర్స్ హాకీ విజేత ‘అనంత’
• సత్తాచాటిన అనంత బాలికలు
• సెమీస్‌లో ట్రైబ్రెక్స్ ద్వారా విజయం
• రన్నర్స్‌గా తూర్పుగోదావరి జట్టు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఏడవ రాష్ట్ర జూనియర్స్ బాలికల హాకీ విజేతగా అనంత జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో అనంత జట్టు తూర్పుగోదావరి జట్టు పై 3–0తో విజయం సాధించింది. జట్టులో జ్యోతి, సంధ్య, రోషిత చెరొ ఒక గోల్‌చేసి జట్టుకు విజయాన్ని అందించారు. తూర్పుగోదావరి జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు ట్రోఫీల ప్రదాన కార్యక్రమానికి సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దామోదరన్, ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. మన ఆలోచన విధానమే మన లను ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందన్నారు. ఎస్కేయూ మాజీ వీసీ రామకష్ణారెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామప్ప, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జాకీర్‌హుస్సేన్, హాకీ అసోసియేషన్ ట్రెజరర్ బాబయ్య, టోర్నీ కో–ఆర్డీనేటర్ రవిరాజా, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
సెమీఫైనల్స్ వివరాలు
అనంతపురం–విశాఖపట్టణం మధ్య జరిగిన మ్యాచ్‌లో 1–1 తో డ్రా కాగా ట్రైబ్రేక్స్ లో 4–3 తో విజయం సాధించింది. అనంత క్రీడాకారిణీ రోషిత–4, గోల్స్ చేయగా, విశాఖ క్రీడాకారిణీ భవానీ–3 గోల్స్ చేసింది. తూర్పు గోదావరి–వైయస్సార్ కడప జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 3–0తో వైయస్సార్ జట్టును తూర్పుగోదావరి జట్టు ఓడించింది. తూర్పుగోదావరి జట్టులో వరలక్ష్మీ–2, పద్మావతీ–1 గోళ్లు చేశారు. మూడవ ప్లేస్ కోసం జరిగిన పెనాల్టీ షూట్–అవుట్‌లో వైయస్సార్ కడప జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు.