
రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో ఆదివారం జరిగిన తియాన్‌జిన్ ఓపెన్‌లో షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 7–5, 7–6 (8/6)తో అర్యానా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది.
గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరాగమనం చేసింది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment