సుదీర్ఘ కౌంటింగ్లో సూచీకి 880 స్థానాలు | National League for Democracy wins 77.3 percent seats in elections | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ కౌంటింగ్లో సూచీకి 880 స్థానాలు

Published Mon, Nov 16 2015 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM

సుదీర్ఘ కౌంటింగ్లో సూచీకి 880 స్థానాలు

సుదీర్ఘ కౌంటింగ్లో సూచీకి 880 స్థానాలు

సుదీర్ఘంగా జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మయన్మార్ ఆశాకిరణం ఆంగ్సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ 77.3 శాతం స్థానాలను గెలుచుకుంది. 1,139 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ 880 స్థానాలను గెలుచుకోగా అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ పది శాతం సీట్లతో 115 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన స్థానాలను వేరు వేరు చిన్న పార్టీల వారు గెలుచుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అయితే మయన్మార్ పార్లమెంట్ సభ్యులలో 75 శాతం సభ్యులను ఈ ఎన్నికల ద్వారా భర్తీ చేయనుండగా మిగిలిన 25 శాతం మందిని నేరుగా మయన్మార్ మిలిటరీ నామినేట్ చేస్తుంది. మయన్మార్ పార్లమెంట్ తొలి సమావేశాలు జనవరిలో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం మార్చిలో కొలువుదీరనుంది. మార్చి చివరిలో ప్రస్తుత అధికార ప్రభుత్వం రద్దుకానుంది. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి సూచీ విజయం ఎప్పుడో ఖరారైనా, అక్కడి ఎన్నికల కౌటింగ్ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతన, అధికార పాలకుల ఉద్దేశపూర్వక కాలయాపన ఫలితంగా ఫలితాల విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement