
మహిళల టెన్నిస్‌లో పోలాండ్ నుంచి మరో కొత్త స్టార్ అవతరించింది.

26 ఏళ్ల మగ్ధలీనా ఫ్రెచ్ గ్వాడలహారా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోరీ్నలో విజేతగా నిలిచింది.

మగ్ధలీనా కెరీర్‌లో ఇదే తొలి డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.

ఫైనల్లో మగ్ధలీనా 7–6 (7/5), 6–4తో ఒలివియా గడెస్కి (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది.

2001 తర్వాత పోలాండ్ నుంచి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణిగా మగ్ధలీనా గుర్తింపు పొందింది.

గత 23 ఏళ్లలో మగ్ధా లినెట్టి, అగ్నెస్కా రద్వాన్‌స్కా, ఇగా స్వియాటెక్ ఈ ఘనత సాధించారు.

స్వియాటెక్ కొంతకాలంగా మహిళల టెన్నిస్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా ఉంది.

గ్వాడలహారా ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన మగ్ధలీనా 11 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 32వ ర్యాంక్‌కు చేరుకుంది.

మగ్ధలీనాకు 1,42,000 డాలర్ల (రూ. 1 కోటి 11 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

