తులసీ చైతన్యకు ఆరు పతకాలు  | Swimmer Tulasi Chaitanya Won Six Medals In China | Sakshi
Sakshi News home page

తులసీ చైతన్యకు ఆరు పతకాలు 

Published Mon, Aug 19 2019 6:56 AM | Last Updated on Mon, Aug 19 2019 6:56 AM

Swimmer Tulasi Chaitanya Won Six Medals In China - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విజయవాడ స్విమ్మర్‌ తులసీ చైతన్య అద్భుత ప్రదర్శన చేశాడు. చైనాలోని చెంగ్డూలో జరిగిన ఈ క్రీడల్లో తులసీ చైతన్య ఒకస్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించాడు. విజయవాడలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే తులసీ చైతన్య ట్రయాథ్లాన్‌ టీమ్‌ ఈవెంట్‌లో పసిడి పతకం గెల్చుకోగా... 4్ఠ50 మిక్స్‌డ్‌ ఫ్రీస్టయిల్‌ రిలేలో, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజత పతకాలు సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 4్ఠ50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలేలో తులసీ చైతన్య కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తులసీ చైతన్య మూడుసార్లు (2013, 2017, 2019) ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 20 పతకాలు సాధించాడు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement